Hyderabad: గ్రీన్.. జెయింట్.. కోర్.. కోడ్ భాషలతో గంజాయి కొనుగోలు
ABN, Publish Date - Dec 22 , 2024 | 12:32 PM
నానక్‌రామ్‌గూడ(Nanakramguda)లో గంజాయి డాన్‌గా పేరుగాంచిన నీతూబాయ్ వద్ద గంజా కోసం ఎగబడుతున్న కస్టమర్స్‌పై ఎక్సైజ్ పోలీసులు నజర్ పెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం నీతూబాయ్ వ్యవహారం అటు ఎక్సైజ్ ఇటు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
- నీతూబాయ్ గంజాయి కస్టమర్స్‌పై ఎక్సైజ్ పోలీసులు నజర్
- రెండు రోజుల్లో అదుపులోకి 150 మంది..
హైదరాబాద్ సిటీ: నానక్‌రామ్‌గూడ(Nanakramguda)లో గంజాయి డాన్‌గా పేరుగాంచిన నీతూబాయ్ వద్ద గంజా కోసం ఎగబడుతున్న కస్టమర్స్‌పై ఎక్సైజ్ పోలీసులు నజర్ పెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం నీతూబాయ్ వ్యవహారం అటు ఎక్సైజ్ ఇటు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి ఆమె వద్ద గంజాయి కొనుగోలు చేయడానికి ఎవరెవరు వస్తున్నారు..? ఎంత మంది వస్తున్నారనేది ఆరా తీస్తున్నారు. అయితే, కేవలం 15 నిమిషాల్లోనే 20 మంది కస్టమర్స్ గంజాయి కోసం వచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. ఒక్క గంటలో వారి సంఖ్య 80-100మందికి చేరినట్లు గుర్తించారు.
ఈ వార్తను కూడా చదవండి: TG NEWS: సినిమాను తలపించేలా బోరబండ ఆటో డ్రైవర్ హత్య కేసు
రహస్యంగా విచారణ..
వినియోగదారులపై ప్రత్యేక నిఘా పెట్టిన ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ (స్టేట్ టాస్క్‌ఫోర్స్) స్పెషల్ టీమ్స్.. రెండు రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 150మంది కస్టమర్స్‌ను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారిలో ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రాంతాలకు చెందిన కార్మికులు ఉన్నట్లు సమాచారం. వారందరినీ శివారు ప్రాంతాల్లోని రహస్య ప్రాంతాలకు తరలించి సెల్‌ఫోన్‌లు సీజ్ చేసి విచారించినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నారు..? సరుకును ఎక్కడ తీసుకుంటున్నారు? ఎంతచొప్పున చెల్లిస్తున్నారనే కోణంలో విచారించి, స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నట్లు తెలిసింది.
కోడ్ భాషతో కొనుగోలు..
గంజాయిని కొనుగోలు చేసే క్రమంలో నీతూబాయ్(Neetubai) అడ్డా వద్ద వినియోగదారులు వివిధ కోడ్ భాషలను వినియోగిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. కొంతమంది ఐటీ ఉద్యోగులు గ్రీన్ అని, వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు జెయింట్ అని, మరికొంతమంది కోర్ అనే కోడ్ భాషతో గంజాయిని కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. అలా కస్టమర్స్ చెప్పిన కోడ్ బట్టి వారికి అడిగిన గంజాయి పొట్లాలను నీతూబాయ్ టీమ్ అందిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించినట్లుగా తెలిసింది. ఇలా రోజుకు 15-20 కేజీల గంజాయి విక్రయిస్తూ రూ.5 లక్షలు సంపాదిస్తున్న లేడీ డాన్ నీతూబాయ్ కోసం ఎక్సైజ్ పోలీసులు గాలిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మానవత్వం లేదా ?
ఈవార్తను కూడా చదవండి: KTR: రేవంత్ తేల్చుకుందాం.. కేటీఆర్ సవాల్
ఈవార్తను కూడా చదవండి: అల్లు అర్జున్ వ్యాఖ్యలపై ఊహించని పరిణామం
ఈవార్తను కూడా చదవండి: ‘సత్వా ఎలిగ్జిర్’లో భారీ అగ్ని ప్రమాదం
Read Latest Telangana News and National News
Updated Date - Dec 22 , 2024 | 12:32 PM