ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: గ్రేటర్‌లో కొత్త సబ్‌స్టేషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌..

ABN, Publish Date - Jul 09 , 2024 | 10:11 AM

గ్రేటర్‌(Greater)లో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ నేపథ్యంలో భవిష్యత్‌ అవసరాలను తీర్చేలా కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్‌) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

- భవిష్యత్‌ డిమాండ్‌ నేపథ్యంలో డిస్కం చర్యలు

- 10 సర్కిళ్లలో కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు వివరాల సేకరణ

- మార్చినాటికి గ్రేటర్‌ జోన్‌లో 70 సబ్‌స్టేషన్ల నిర్మాణమే లక్ష్యం

- సర్కిళ్ల వారీగా అధికారులతో సీఎండీ సమీక్షలు

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌(Greater)లో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ నేపథ్యంలో భవిష్యత్‌ అవసరాలను తీర్చేలా కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్‌) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రాబోయే పదేళ్లలో గ్రేటర్‌జోన్‌ పరిధిలో మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్‌ జోన్లలో పెరిగే విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని 10సర్కిళ్ల (బంజారాహిల్స్‌, సైబర్‌సిటీ, హబ్సిగూడ, హైదరాబాద్‌ సెంట్రల్‌, హైదరాబాద్‌ సౌత్‌, మేడ్చల్‌, రాజ్రేంద్రనగర్‌, సంగారెడ్డి(Sangareddy), సరూర్‌నగర్‌, సికింద్రాబాద్‌)లో కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు డిస్కం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సర్కిళ్ల వారీగా ఏయే ప్రాంతాల్లో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో పెరుగుతోంది..? వచ్చే పదేళ్లలో ఏ సర్కిల్‌లో ఎంత డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందనే.. ముందస్తు అంచనాలతో కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని విద్యుత్‌శాఖ నిర్ణయించింది. కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు సర్కిళ్ల వారీగా అధికారులతో టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూకీ ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇదికూడా చదవండి: GHMC: 5 నుంచి 15కు.. జీహెచ్‌ఎంసీలో పెరగనున్న కో ఆప్షన్‌ సభ్యుల సంఖ్య


శివారు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో విద్యుత్‌ డిమాండ్‌

గ్రేటర్‌ శివారు ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు వందల సంఖ్యలో నిర్మాణాలు జరుగుతుండటంతో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో పెరుగుతున్నది. ఒక్కో అపార్ట్‌మెంట్‌లో వెయ్యి, 1500 ప్లాట్లు ఉంటుండటంతో ఆయా ప్రాంతాల్లో కొత్త సబ్‌స్టేషన్లను నిర్మించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మేడ్చల్‌, హబ్సిగూడ, సరూర్‌నగర్‌, సంగారెడ్డి, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు అందుబాటులోకి వస్తుండటంతో కమర్షియల్‌ విద్యుత్‌వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతున్నది. ఈ యేడాది మే- జూన్‌ నెలల్లో గ్రేటర్‌జోన్‌లో రోజువారి విద్యుత్‌ వినియోగం 91 మిలియన్‌ యూనిట్ల వరకు చేరింది. వచ్చే ఏడాది సమ్మర్‌లో మరో 15-20 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ పెరిగే అవకాశాలుంటాయని డిస్కం అంచనా వేస్తోంది. రాబోయే 5 ఏళ్లలో గ్రేటర్‌జోన్‌ విద్యుత్‌వినియోగం రెట్టింపయ్యే అవకాశాలుంటాయని ఆ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్లు అందుబాటులోకి తీసుకురావాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.


పదేళ్ల అవసరాలకు సరిపడేలా..

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెల సమ్మర్‌లో పెరిగిన విద్యుత్‌డిమాండ్‌ లెక్కల ఆధారంగా రాబోయే పదేళ్ల అవసరాలకు సరిపడే స్థాయిలో సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పలు సర్కిళ్లలో గతంలో కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాలు కేటాయించడంతో వాటిని పరిశీలించి ఎలాంటి వివాదాలు లేని ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణాలకు టెండర్లు పిలిచేదిశగా డిస్కం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని సర్కిళ్లలో సబ్‌స్టేషన్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలంటూ విద్యుత్‌శాఖ ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాస్తోంది. గ్రేటర్‌జోన్‌లో 2025 మార్చి నాటికి 60-70 వరకు కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించాలని డిస్కం లక్ష్యంగా పెట్టుకుంది.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 09 , 2024 | 10:11 AM

Advertising
Advertising
<