Hyderabad: అరాచకశక్తులపై తుపాకీ గురి..
ABN, Publish Date - Jun 25 , 2024 | 10:00 AM
దొంగల ముఠాలు, చైన్‌స్నాచర్లు, అర్ధరాత్రి దారిదోపిడీలకు పాల్పడే అల్లరిమూకలు, రౌడీగ్యాంగ్‌ల ఆటకట్టించడమే లక్ష్యంగా ప్రత్యేక డెకాయ్ ఆపరేషన్ టీమ్‌లను సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి(City Police Commissioner Kottakota Srinivas Reddy) రంగంలోకి దింపారు.
- మఫ్టీలో ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు
- దొంగల ముఠాలు, స్నాచర్ల భరతం పట్టేందుకు డెకాయ్ ఆపరేషన్స్
- వారం రోజుల్లోనే 9 ముఠాల ఆటకట్టించిన పోలీసులు
- నాలుగు చోట్ల గాల్లోకి కాల్పులు
హైదరాబాద్ సిటీ: దొంగల ముఠాలు, చైన్‌స్నాచర్లు, అర్ధరాత్రి దారిదోపిడీలకు పాల్పడే అల్లరిమూకలు, రౌడీగ్యాంగ్‌ల ఆటకట్టించడమే లక్ష్యంగా ప్రత్యేక డెకాయ్ ఆపరేషన్ టీమ్‌లను సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి(City Police Commissioner Kottakota Srinivas Reddy) రంగంలోకి దింపారు. నగరంలో అరాచక శక్తుల ఆగడాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా చైన్‌స్నాచర్లు పంజా విసురుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీ ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు.
ఇదికూడా చదవండి: Hyderabad: ఫెయిల్ అయ్యానని.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
డెకాయ్ ఆపరేషన్ ఇలా..
లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు.. ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లను జతచేసి యాంటీ స్నాచింగ్ టీమ్‌గా ఏర్పాటు చేశారు. ఏఆర్ పోలీసుల వద్ద తుపాకులు ఉంటాయి. లా అండ్ ఆర్డర్ కానిస్టేబుల్స్ బస్టా్‌పలు, ఫుట్‌పాత్‌లు, పలు కాలనీల్లోని హాట్‌స్పాట్స్, తదితర ప్రాంతాల్లో రాత్రిపూట మఫ్టీలో సాధారణ పౌరుల్లా ఒంటరిగా కూర్చొని డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తుంటారు. ఒంటరిగా ఉన్న వారి వద్దకు దొంగలు, పోకిరీలు, అల్లరిమూకలు, ఇతర నేరస్తులు వచ్చి.. సెల్‌ఫోన్, డబ్బులు, లేదా ఇతర విలువైన వస్తువులను దోచుకునే ప్రయత్నం చేస్తుంటారు.
ఈ క్రమంలో మఫ్టీలో కూర్చున్న కానిస్టేబుల్ ఒక్కసారిగా అప్రమత్తమై వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆ పక్కనే మాటువేసిన ఏఆర్ కానిస్టేబుల్స్ తుపాకులతో రెడీగా ఉండి రంగంలోకి దిగుతారు. అంతా కలిసి దొంగల ముఠాను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో దొంగలు, నేరస్తులు వారి వద్ద ఉన్న మారణాయుధాలతో ఎదురు తిరిగితే ఏఆర్ పోలీసులు తుపాకులతో కాల్పులు జరుపుతారు. అలా ఆ ముఠాలను వెంటాడి, వేటాడి మరీ అదుపులోకి తీసుకుంటారు. ఒకవేళ అంతర్రాష్ట్ర ముఠాలు, ఘరానా దొంగలు చిక్కినట్లే చిక్కి పారిపోయే ప్రయత్నం చేస్తే స్థానిక పోలీసుల సహకారంతో పట్టుకుంటారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 25 , 2024 | 10:00 AM