ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: హై.. డర్‌ర్‌! అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

ABN, Publish Date - Aug 25 , 2024 | 12:39 PM

హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేసిన, చేస్తున్న వారిని గడగడలాడిస్తోంది.

- కొనసాగుతున్న కూల్చివేతలు

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేసిన, చేస్తున్న వారిని గడగడలాడిస్తోంది. కేవలం 42 రోజుల్లో చిన్న, పెద్ద భవనాలన్నీ కలిపి దాదాపు 70కి పైగా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా శనివారం ఖానామెట్‌(Khanamet) గ్రామ పరిధిలో ప్రముఖ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్‌. కన్వెన్షన్‌(N. Convention)ను కూల్చివేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చెరువులను చెరపట్టిన వారిలో ఎంతటి వారున్నా వదిలేది లేదని దూకుడు ప్రదర్శిస్తుండడం ఆసక్తికరంగా మారింది.

ఇదికూడా చదవండి: Hyderabad: 70 వసంతాలు..70 అడుగులు


హైడ్రా కూల్చివేతలు ఇవే..!

జూలై 12: హైడ్రా ఏర్పాటు

ఆగస్టు 6: గాజులరామారం, దేవేందర్‌నగర్‌లో 52 అక్రమ నిర్మాణాల కూల్చివేత

7: నందగిరిహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో 17 నిర్మాణాల తొలగింపు

10: శాస్ర్తీపురంలోని బూమ్‌రుఖ్‌ ఉద్‌ దవాళ్‌ చెరువులో అక్రమ నిర్మాణాలు నేలమట్టం


15: నిజాంపేట కార్పొరేషన్‌, ప్రగతినగర్‌ ప్రాంతంలోని ఎర్ర చెరువు (ఎఫ్‌టీఎల్‌) భూమిలో మూడు, ఐదంతస్తు భవనాలు..

18: గండిపేట మండలం అప్పోజిగూడ పంచాయతీలోకి వచ్చే మూడు భవనాలు, చిలుకూరు పరిధిలోని ఒక భవనం కూల్చివేత

24: ఖానామెట్‌లోని సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌-కన్వెన్షన్‌ను కూల్చివేశారు.


........................................................................

ఈ వార్తను కూడా చదవండి:

........................................................................

Hyderabad: గ్రేటర్‌లో 9 సర్కిళ్లలో ఎస్‌ఈల బదిలీలు..

హైదరాబాద్‌ సిటీ: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) గ్రేటర్‌ పరిధిలోని 9 సర్కిళ్ల సూపరింటెండింగ్‌ ఇంజనీర్ల(ఎ్‌సఈ)ను బదిలీ చేస్తూ సీఎండీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బంజారాహిల్స్‌(Banjara Hills) సర్కిల్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌ను సైబర్‌సిటీ సర్కిల్‌ ఎస్‌ఈగా, మేడ్చల్‌ సర్కిల్‌ ఎస్‌ఈ డీఎస్‌ మోహన్‌ను రాజేంద్రనగర్‌ సర్కిల్‌కు బదిలీ చేశారు. సికింద్రాబాద్‌ సర్కిల్‌ ఎస్‌ఈ రవికుమార్‌ను మేడ్చల్‌ సర్కిల్‌కు, సంగారెడ్డి సర్కిల్‌ ఎస్‌ఈ మాధవరెడ్డిని సరూర్‌నగర్‌(Sarurnagar) సర్కిల్‌కు,


సరూర్‌నగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ కరుణాకర్‌బాబును బంజారాహిల్స్‌ సర్కిల్‌కు, సైబర్‌సిటీ సర్కిల్‌ ఎస్‌ఈ పి.వెంకన్నను హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌ ఎస్‌ఈగా బదిలీ చేయగా, సంగారెడ్డి సర్కిల్‌ ఎస్‌ఈగా శ్రీనాథ్‌ను హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌ ఎస్‌ఈగా సోమిరెడ్డిని నియమించారు. గ్రీన్‌ల్యాండ్స్‌ డీఈ సుధీర్‌కుమార్‌కు ఎస్‌ఈగా ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌ (ఎఫ్‌ఏసీ) ఇస్తూ యాదాద్రి సర్కిల్‌కు బదిలీ చేశారు. గ్రేటర్‌జోన్‌లో 9 సర్కిళ్ల ఎస్‌ఈలను బదిలీ చేయడం ఇదే మొదటిసారి. త్వరలో సీఈ, డీఈ, ఏడీఈల బదిలీలు ఉంటాయని విద్యుత్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 25 , 2024 | 12:39 PM

Advertising
Advertising
<