ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: 3 గంటల్లో.. 688 కేసులు..

ABN, Publish Date - Aug 08 , 2024 | 09:37 AM

నగరంలో విచ్చలవిడిగా పెరుగుతున్న రాంగ్‌రూట్‌(Wrongroot) డ్రైవింగ్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్న వాహనదారులపై బుధవారం ఉక్కుపాదం మోపారు.

- ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌

- రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌పై ఉక్కుపాదం

- వాహనాలు సీజ్‌.. చలానా వసూలు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో విచ్చలవిడిగా పెరుగుతున్న రాంగ్‌రూట్‌(Wrongroot) డ్రైవింగ్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్న వాహనదారులపై బుధవారం ఉక్కుపాదం మోపారు. నగర అదనపు సీపీ (ట్రాఫిక్‌) విశ్వప్రసాద్‌(City Additional CP (Traffic) Vishwaprasad), డీసీపీ రాహుల్‌ హెగ్డే నేతృత్వంలో ట్రాఫిక్‌ పోలీసులు సిటీ కమిషనరేట్‌(City Commissionerate) పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కేవలం మూడు గంటల్లో 688 కేసులు నమోదు చేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: బీఆర్‌ఎస్‌ విలీనం అంటూ దుష్ప్రచారం: కేటీఆర్‌


వీటిలో 659 ద్విచక్ర, 21 త్రిచక్ర, 8 ఫోర్‌వీలర్‌ వాహనాలున్నాయి. వెంటనే సీజ్‌ చేసి, చలానాలు విధించి వసూలు చేసిన తర్వాత వదిలిపెట్టారు. రాంగ్‌రూట్‌లో వచ్చి పట్టుబడిన వాహనదారులకు అదనపు సీపీ, డీసీపీలు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కాగా, పోలీసుల గణాంకాల ప్రకారం 2023లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో రాంగ్‌ డ్రైవింగ్‌ వల్ల 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయాలపాలయ్యారు. 2024లో ఇప్పటివరకు ఒకరు మృతిచెందగా.. 128 మందికి గాయాలయ్యాయి.


రహదారి భద్రతకు పెద్దపీట : విశ్వప్రసాద్‌, ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ

నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను కంట్రోల్‌(Traffic control) చేయడం పోలీసులకు పెనుసవాల్‌గా మారిందని ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ అన్నారు. ఇక నుంచి ట్రాఫిక్‌ ఉల్లంఘనలను ఉపేక్షించేది లేదని, పట్టుబడిన వాహనదారులకు రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పదేపదే పోలీసులకు పట్టుబడితే వారిని కోర్టులో హాజరుపర్చుతామని, 6 నెలల వరకు జైలుశిక్ష పడే అవకాశముందని తెలిపారు.


ఉల్లంఘనులతో డీసీపీ ప్రతిజ్ఞ

ఖైరతాబాద్‌: సైఫాబాద్‌, చిక్కడపల్లి, అబిడ్స్‌(Saifabad, Chikkadapally, Abids) పోలీస్ స్టేషన్ల పరిధుల్లో రాంగ్‌రూట్‌లో వచ్చిన 60 మంది ద్విచక్ర వాహనదారులను పోలీసులు పట్టుకొని చలానా విధించారు. అనంతరం ట్రాఫిక్‌ డీసీపీ అశోక్‌కుమార్‌ ఇకనుంచి రాంగ్‌రూట్లో ప్రయాణించమని వారిచే ప్రతిజ్ఞ చేయించారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Updated Date - Aug 08 , 2024 | 09:37 AM

Advertising
Advertising
<