ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: వర్షం నేపథ్యంలో.. ఐటీ కంపెనీలు షిఫ్ట్‌లు మార్చుకోవాలి

ABN, Publish Date - May 17 , 2024 | 11:31 AM

భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఈవీడీఎం) విభాగం ముందస్తు హెచ్చరికలు జారీచేసింది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య భారీ వర్షం(Heavy rain) కురిసే అవకాశముందని, ఆ సమయంలో ప్రయాణాలు లేకుండా చూసుకోవాలని ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాష్ రెడ్డి సూచించారు.

- వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌ సిటీ: భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఈవీడీఎం) విభాగం ముందస్తు హెచ్చరికలు జారీచేసింది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య భారీ వర్షం(Heavy rain) కురిసే అవకాశముందని, ఆ సమయంలో ప్రయాణాలు లేకుండా చూసుకోవాలని ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాష్ రెడ్డి సూచించారు. జోన్ల వారీగా ఏ ప్రాంతంలో వర్ష సూచన ఉంది అన్నది డీఆర్‌ఎఫ్‌ ఎక్స్‌ ఖాతాలో, వాట్సప్‌ గ్రూపుల్లో పోస్ట్‌ చేశారు. వరద నీరు నిలిచినా.. చెట్లు కూలినా, కొమ్మలు విరిగినా.. జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 040-21111111, డీఆర్‌ఎఫ్‌ నంబర్‌ 9000113667కు కాల్‌ చేయాలని సూచించారు. సాయంత్రం 4.40 నుంచి 6 గంటల వరకు వర్షం తగ్గే అవకాశముందని, 6 గంటల తరువాత మరో గంటపాటు వర్ష సూచన ఉన్న దృష్టా.. తదనుగుణంగా ప్రయాణాలు ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు వర్ష సూచనను దృష్టిలో ఉంచుకొని షిఫ్ట్‌ టైమింగ్‌ మార్చుకోవాలని కోరారు. వర్షం కురిసిన సమయంలో బయటకు రావడం వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు. వర్షం కురిసినప్పుడు రాకపోకల అంతరాయం, ప్రమాదాలు జరిగే అవకాశమున్న దృష్టా.. వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండడం మేలని జీహెచ్‌ఎంసీ సూచిస్తోంది.

Updated Date - May 17 , 2024 | 11:33 AM

Advertising
Advertising