ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: జేఎన్‌టీయూ షాన్‌దార్‌.. ఇంజినీరింగ్‌ విద్యలో వర్సిటీ మేటి

ABN, Publish Date - Jul 21 , 2024 | 11:38 AM

నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్యకు కేరాఫ్‏గా నిలిచిన జేఎన్‌టీయూ(JNTU)కు ఏటా క్రేజ్‌ పెరుగుతోంది. ప్రైవేటు కాలేజీలకు తీసిపోని విధంగా విద్య, చక్కటి వసతులు కల్పిస్తుండడంతో వర్సిటీలో అభ్యసించేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు.

- టాప్‌టెన్‌లో ఒకరు..వెయ్యిలోపు 31 మంది

- మొత్తం 690 సీట్లలో ఒక్కటీ మిగల్లేదు

- మొదటి విడత కేటాయింపులోనే సీట్లన్నీ భర్తీ

హైదరాబాద్‌ సిటీ: నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్యకు కేరాఫ్‏గా నిలిచిన జేఎన్‌టీయూ(JNTU)కు ఏటా క్రేజ్‌ పెరుగుతోంది. ప్రైవేటు కాలేజీలకు తీసిపోని విధంగా విద్య, చక్కటి వసతులు కల్పిస్తుండడంతో వర్సిటీలో అభ్యసించేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్‌సెట్‌-2024 మొదటి విడత సీట్ల కేటాయింపులో టాపర్ల చూపంతా జేఎన్‌టీయూ వైపు మళ్లడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో లేని విధంగా హైదరాబాద్‌ జేఎన్‌టీయూ కాలేజీలో చదివేందుకు టాప్‌టెన్‌(top ten)లో ఒకరు, వెయ్యిలోపు ర్యాంకర్లలో 31మంది ఆప్షన్లు ఎంచుకోవడం విశేషం. ఎప్‌సెట్‌లో 9వ ర్యాంకు సాధించిన కొణతం మణితేజ కంప్యూటర్‌ సైన్స్‌ చదివేందుకు ఆప్షన్‌ ఇచ్చుకోగా, సీటు లభించింది. మరోవైపు వెయ్యిలోపు ర్యాంకులు పొందిన మరో 31 మంది అభ్యర్థులు కూడా జేఎన్‌టీయూలో వివిధ కోర్సులు చదివేందుకు ఆసక్తి చూపడం పట్ల సీనియర్‌ విద్యార్థులు, ఆచార్యుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

ఇదికూడా చదవండి: Hyderabad: తక్కువ ఫీజుతో అమెరికాలో ఉన్నతవిద్య..


మొదటి ప్రాధాన్యత సీఎస్ఈకే

జేఎన్‌టీయూ కాలేజీలో చదివేందుకు ఆసక్తి చూపిన టాప్‌ ర్యాంకర్లలో ఎక్కువశాతం తమ తొలి ఆప్షన్‌ను కంప్యూటర్‌ సైన్స్‌కే ఇచ్చారు. వెయ్యిలోపు ర్యాంకుల్లో జేఎన్‌టీయూ కాలేజీని ఎంచుకున్న అభ్యర్థులు మొత్తం 27మంది ఉండగా, ఇందులో సీఎస్ఈ కోర్సులో24 మందికి సీట్లు లభించాయి. మరో ఐదుగురు సీఎ్‌సఈ అనుబంధంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌లెర్నింగ్‌ కోర్సును ఎంచుకున్నారు. కాగా ఇద్దరు అభ్యర్థులు తమ తొలి ప్రాధాన్యతను ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌కు ఇవ్వగా, ఒకరికి సైబర్‌ సెక్యూరిటీ కోర్సులో సీటు లభించింది. గ్రేటర్‌ పరిధిలో ఉన్న మరొక ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల ఓయూ ఇంజనీరింగ్‌ కాలేజీకి ఈ ఏడాది వెయ్యిలోపు ర్యాంకర్లలో కేవలం ముగ్గురు మాత్రమే ఆప్షన్లు ఇవ్వడం గమనార్హం. ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా సీఎస్ఈ కోర్సులోనే సీట్లు దక్కించుకున్నారు.


690 సీట్లలో ఒక్కటీ మిగల్లేదు

జేఎన్‌టీయూ హైదరాబాద్‌ కాలేజీలో మొత్తం 11 ఇంజనీరింగ్‌ కోర్సులు ఉండగా, ఫస్టియర్‌ బీటెక్‌లో సీఎస్ఈ, ఏఐఎంఎల్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఈసీఈ, ఈఈఈ, సివిల్‌, మెకానికల్‌, మెటలర్జీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌, బయోటెక్నాలజీ, జియో ఇన్ఫర్మేటిక్స్‌ కోర్సుల్లో 66 చొప్పున మొత్తం 690 సీట్లున్నాయి. ఏ బ్రాంచ్‌లోనూ ఒక్కసీటు కూడా మిగలకపోవడం విశేషమని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.వి.నర్సింహారెడ్డి అన్నారు. ఐఐటీలతో సమానంగా జేఎన్‌టీయూ కాలేజీలోని కొన్ని విభాగాల్లో వరల్డ్‌క్లాస్‌ ల్యాబొరేటరీలు, ఇతర సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది కంప్యూటర్‌ సైన్స్‌లో అత్యధికంగా ఒక విద్యార్థికి రూ.52 లక్షల ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌ లభించిందని వెల్లడించారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 21 , 2024 | 11:38 AM

Advertising
Advertising
<