Hyderabad: తెలంగాణ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలి
ABN, Publish Date - Dec 25 , 2024 | 09:42 AM
తెలంగాణ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని, నీట్ పీజీ 2024-25 మెరిట్ లిస్టు(NEET PG 2024-25 Merit List)ను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు వైద్య విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.
- నీట్ పీజీ 2024-25 మెరిట్ లిస్ట్ ప్రకటించాలి
- రాష్ట్ర ప్రభుత్వానికి వైద్యవిద్యార్థుల విజ్ఞప్తి
హైదరాబాద్: తెలంగాణ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని, నీట్ పీజీ 2024-25 మెరిట్ లిస్టు(NEET PG 2024-25 Merit List)ను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు వైద్య విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నీట్ పరీక్ష రాసిన వైద్య విద్యార్థులు వినయ్ కుమార్, వంశీ, మల్లికార్జున, అభినవ్‌లు డాక్టర్ డి.వెంకటేష్ కుమార్‌తో కలిసి మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టులో నీట్ పీజీ 2024-25 పరీక్ష జరగ్గా, అదే నెల 25న ఫలితాలు వచ్చాయని వారు తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆర్నెళ్ల చిన్నారిని లాక్కున్నారు.. తల్లిని వెళ్లగొట్టారు..
రాష్ట్ర విద్యార్థులకు న్యాయం చేకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ జీవో తెచ్చిందని, దీనిని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే, దానిపై పొరుగు రాష్ట్రానికి చెందిన వారు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, వారికి అనుకూలంగా తీర్పు రావడంతో ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పీజీ వైద్య ప్రవేశాలు జరుగుతున్నాయని, జాతీయ స్థాయిలో ఇప్పటికే రెండుసార్లు కౌన్సెలింగ్ జరిగిందని,
ఈనెల 26తో కౌన్సెలింగ్ ముగుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కౌన్సెలింగ్ ఆలస్యం అయితే తెలంగాణ విద్యార్థులు నష్టపోతారని, సుప్రీంకోర్టులో తీర్పు రావడానికి ఆలస్యం జరుగుతుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయడానికి ప్రత్యామ్నాయ పద్ధతులు గుర్తించి త్వరగా న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: తప్పయిపోయింది!
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: తప్పు జరిగితే.. వేటు తప్పదు!
ఈవార్తను కూడా చదవండి: నేడు, రేపు మోస్తరు వర్షాలు
ఈవార్తను కూడా చదవండి: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 25 , 2024 | 09:42 AM