ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: భారీ గణపతి మట్టి పనులు ప్రారంభం..

ABN, Publish Date - Aug 02 , 2024 | 11:19 AM

ప్రతిష్ఠాత్మక ఖైరతాబాద్‌(Khairatabad) గణపతి విగ్రహం తయారీలో కీలక దశగా భావించే మట్టి పనులు గురువారం ప్రారంభమయ్యాయి. సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతి రెండు పాదాల నుంచి మట్టి పనులను ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రారంభించారు.

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఖైరతాబాద్‌(Khairatabad) గణపతి విగ్రహం తయారీలో కీలక దశగా భావించే మట్టి పనులు గురువారం ప్రారంభమయ్యాయి. సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతి రెండు పాదాల నుంచి మట్టి పనులను ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌(BC Commission Chairman Vakulabharanam Krishnamohan)తో పాటు బీఆర్‌ఎస్‌ నేత బిల్డర్‌ రమేష్‌, టీపీసీసీ నేత మధుకర్‌యాదవ్‌, మల్లేష్ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. మట్టి పనులతో రెండు రోజుల్లో ఖైరతాబాద్‌(Khairatabad) గణపతికి ఒక రూపం రానుంది. ఇప్పటికే వెల్డింగ్‌ పనులు పూర్తి కాగా గురువారం సాయంత్రం వరకు స్టీలు వెల్డింగ్‌ పైనుంచి సన్నటి మెష్‌ వేసే పనులు పూర్తి చేసి మట్టిపనులను ప్రారంభించారు.

ఇదికూడా చదవండి: MRPS: ఎంఆర్‌పీఎస్‌ పోరాటానికి ధర్నాచౌక్‌ అడ్డా..


గురువారం సాయంత్రం శ్రీ పంచముఖ మహాశక్తి గణపతి విగ్రహనమూనాను ఆవిష్కరిస్తామని ఉత్సవ కమిటీ ప్రకటించినా, అనివార్య కారణాల వల్ల నమూనా విడుదలను శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు వాయిదా వేశారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Khairatabad MLA Dana Nagender), ఇతర ప్రముఖులు నమూనాను ఆవిష్కరించనున్నట్లు కమిటీ ప్రతినిధులు సందీ్‌పరాజ్‌, రాజ్‌కుమార్‌, మహేష్ యాదవ్‌, వీణామాధురి, బాల్‌కుమార్‌ తదితరులు తెలిపారు.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 02 , 2024 | 11:19 AM

Advertising
Advertising
<