ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ‘మాయా’నైజ్‌.. రుచిగా ఉంటుంది.. తింటే అనారోగ్యమే

ABN, Publish Date - Oct 26 , 2024 | 09:47 AM

ఫ్రాన్స్‌(France)లో పుట్టిన బర్గర్లు నుంచి శాండ్‌విచ్‌లు.. డిప్స్‌ నుంచి సలాడ్స్‌ వరకూ అన్నింట్లోనూ విరివిగా వాడేస్తోన్న ప్రధానమైన కాండిమెంట్స్‌లో ఒకటిగా నిలిచింది మయోనైజ్‌. మండీకి వెళ్లి బిర్యానీ తిన్నా, బార్బిక్యులో రోస్టెడ్‌ చికెన్‌ రుచి చూసినా, షవార్మ సెంటర్‌లో షవార్మ రోల్‌ తిన్నా, స్టార్‌ హోటల్స్‌లో కాక్‌టైల్‌ పార్టీలో స్నాక్స్‌తో పాటు మయోనైజ్‌ కామన్‌గా ఉంటుంది.

- తయారీలో లోపాలు.. వాడే పదార్థాలే కారణం

- హోటల్‌లో తినేటప్పుడు ఆలోచించాల్సిందే : డాక్టర్లు

- నిషేధించాలని ప్రభుత్వానికి జీహెచ్‌ఎంసీ నివేదిక

హైదరాబాద్‌ సిటీ: ఫ్రాన్స్‌(France)లో పుట్టిన బర్గర్లు నుంచి శాండ్‌విచ్‌లు.. డిప్స్‌ నుంచి సలాడ్స్‌ వరకూ అన్నింట్లోనూ విరివిగా వాడేస్తోన్న ప్రధానమైన కాండిమెంట్స్‌లో ఒకటిగా నిలిచింది మయోనైజ్‌. మండీకి వెళ్లి బిర్యానీ తిన్నా, బార్బిక్యులో రోస్టెడ్‌ చికెన్‌ రుచి చూసినా, షవార్మ సెంటర్‌లో షవార్మ రోల్‌ తిన్నా, స్టార్‌ హోటల్స్‌లో కాక్‌టైల్‌ పార్టీలో స్నాక్స్‌తో పాటు మయోనైజ్‌ కామన్‌గా ఉంటుంది. అతి చిక్కగా ఉండే ఈ క్రీమీ సాస్‌ను పిల్లలు, పెద్దలూ ఇష్టంగానే తింటుంటారు. వెగన్‌ మయోనైజ్‌తో ఇబ్బందులు లేవుకానీ, ఎగ్‌ మయోనైజ్‌లో ప్రధానంగా వాడే గుడ్డు సొనలో ఉండే సాల్మొనెల్లా వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని న్యూట్రిషియనిస్ట్‏లు అంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: MP Etala: పేదల ఇళ్లజోలికొస్తే ఖబడ్దార్‌.. రేవంత్‌రెడ్డి సర్కారు ఎప్పుడు కూలుతుందో..


హోటల్‌లో దీనిని తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలంటున్నారు. ఇంట్లో తయారుచేసుకున్న మయోనైజ్‌ను త్వరగా వినియోగించాలనీ, ముఖ్యంగా కార్డియో, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు వాటి జోలికి వెళ్లకపోవడం మంచిదంటున్నారు. హోటళ్లలో అందుబాటులో ఉంచిన మయోనైజ్‌ వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, దాన్ని నిషేధించాలని జీహెచ్‌ఎంసీ ప్రభుత్వానికి నివేదికలు పంపుతుండడంతో అందరి దృష్టి మయోనైజ్‌పై పడింది. కేరళలో ఎగ్‌ మయోనైజ్‌పై ఇప్పటికే నిషేధం విధించారు.


తీసుకోవడం మంచిదేనా?

హైదరాబాద్‌లో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ సర్వింగ్‌తో రెండు సర్వింగ్‌ల మయోనైజ్‌(Mayonnaise) తినడమూ కనిపిస్తుందని ఓ క్యుఎస్ఆర్‌ చైన్‌ మేనేజర్‌ చెప్పారు. మయోనైజ్‌లో సోయాబీన్‌ లేదా ఇతర ఆయిల్స్‌ కంటెంట్‌ 70-80 శాతం ఉంటుంది. శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌, అన్‌ శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు డైటరీఫ్యాట్‌ కూడా అధికంగానే దీనిద్వారా శరీరంలోకి చేరుతుంది. దీనివల్ల ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్‌ లాంటివి వచ్చే ప్రమాదం ఉందన్నారు ఓ ప్రముఖ హాస్పిటల్‌లో డైటీషియన్‌ అండ్‌ న్యూట్రిషియన్‌ కన్సల్టెంట్‌గా చేస్తోన్న షిజా. కమర్షియల్‌ మయోనైజ్‌ కంటే ఇంట్లో చేసుకునే మయోనైజ్‌ కాస్త మెరుగని చెప్పారు.


మయోనైజ్‌ ఎందుకు ఎక్కువ తీసుకోకూడదనే అంశమై న్యూట్రిషియనిస్ట్‌ లక్ష్మి మాట్లాడుతూ.. టేబుల్‌ స్పూన్‌ (సుమారుగా 13 గ్రాములు) లో 94 కేలరీలు ఉంటాయి. దీంతోపాటు దాదాపు 10 గ్రాముల ఫ్యాట్‌ కూడా లభిస్తుంది. టేబుల్‌ స్పూన్‌లోనే దాదాపు 100 కేలరీల శక్తి లభిస్తుండటంతో పాటు అవసరమైన విటమిన్‌లు, మినరల్స్‌ వంటివి ఏవీ పెద్దగా లభించవని, మయోనైజ్‌ వల్ల ఆరోగ్యపరంగా నష్టమే తప్ప లాభం లేదని, చెడు కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశాలున్నాయన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కేటీఆర్‌లో వణుకు మొదలైంది: ఆది శ్రీనివాస్‌

ఈవార్తను కూడా చదవండి: Winter Weather: వణికిస్తున్న చలి పులి..!

ఈవార్తను కూడా చదవండి: jaggareddy: ఓటమి అనేక పాటలు నేర్పిస్తుంది: జగ్గారెడ్డి

ఈవార్తను కూడా చదవండి: Kidnap: సంగారెడ్డి ఆస్పత్రిలో కిడ్నాప్.. సంచలనం రేపుతున్న ఘటన..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 26 , 2024 | 09:47 AM