ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad Metro: షాకింగ్.. ఆ రూట్‌లో తగ్గనున్న మెట్రో స్టేషన్లు..

ABN, Publish Date - Dec 09 , 2024 | 11:44 AM

Hyderabad Metro: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి ముహూర్తం సమీపిస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) నెలరోజుల క్రితమే కేంద్రానికి చేరగా, అక్కడి నుంచి ఆమోదం రాగానే..

Hyderabad Metro

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 9: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి ముహూర్తం సమీపిస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) నెలరోజుల క్రితమే కేంద్రానికి చేరగా, అక్కడి నుంచి ఆమోదం రాగానే వెంటనే పనులను ప్రారంభించేందుకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) సిద్ధంగా ఉంది. ఇటీవల ఢిల్లీలో మెట్రోరైలు నాలుగోవిడత ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన తరుణంలో.. మన పనులకు కూడా త్వరలోనే ఆమోదం లభించొచ్చని అధికారులు ఆశగా చూస్తున్నారు. రెండోదశలో దాదాపు 5 నెలలు క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని డీపీఆర్‌ను రూపొందించారు. పనుల్లో భాగంగా స్థానిక పేర్లతోనే స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. చారిత్రక ప్రదేశాల ప్రత్యేకతను కాపాడేందుకే వాటి పేర్లతోనే నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మొదటిదశలో ఏర్పాటు చేసిన అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌ మాదిరిగా ఎల్‌బీనగర్‌, చాంద్రాయణగుట్ట స్టేషన్లను కూడా అభివృద్ధి చేసేలా డీపీఆర్‌లో పొందుపరిచారు. ఈ రెండు స్టేషన్లను ఇంటర్‌ఛేంజ్‌గా చేయడం వల్ల నగరంలో ఏ మూల నుంచైనా సులువుగా ప్రయాణించ వచ్చని అధికారులు భావిస్తున్నారు.


నాగోల్‌–ఎయిర్‌పోర్టు మార్గం : స్టేషన్లు–24

నాగోలు, నాగోల్‌ క్రాస్‌రోడ్డు, అల్కాపురి, కామినేని హాస్పిటల్‌, ఎల్‌బీనగర్‌, బైరామల్‌గూడ, మైత్రినగర్‌, కర్మన్‌ఘాట్‌, చంపాపేట్‌ రోడ్డు, ఓవైసీ హాస్పిటల్‌, డీఆర్‌డీవో కంచన్‌బాగ్‌, బాలాపూర్‌ రోడ్డు, చాంద్రాయణగుట్ట (ఇంటర్‌ఛేంజ్‌), బండ్లగూడ రోడ్డు, మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్‌, అరాంఘర్‌, న్యూహైకోర్టు, గగన్‌పహాడ్‌, సాతంరాయ్‌, సిద్ధాంతి, శంషాబాద్‌, ఎయిర్‌పోర్టు కార్గో, ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ స్టేషన్లు ఉన్నాయి.

రాయదుర్గం–కోకాపేట నియోపొలిస్‌: స్టేషన్లు–8

బయోడైవర్సిటీ జంక్షన్‌, ఖాజాగూడ, నానక్‌రామ్‌గూడ, గోల్ఫ్‌కోర్స్‌, విప్రో సర్కిల్‌, ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌, ఖానాపూర్‌, కోకాపేట నియోపొలిస్‌.


ఎంజీబీఎస్‌–చాంద్రాయణగుట్ట: స్టేషన్లు–6

సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, అలియాబాద్‌, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట.

మియాపూర్‌–పటాన్‌చెరు: స్టేషన్లు–10

ఇక్రిశాట్‌, ఆర్‌సీపురం, బీరంగూడ, జ్యోతినగర్‌, బీహెచ్‌ఈఎల్‌, చందానగర్‌, మదీనగూడ, ఆల్విన్‌ క్రాస్‌రోడ్డు, మియాపూర్‌ క్రాస్‌రోడ్డు, మియాపూర్‌.

ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్‌: స్టేషన్లు–6

చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్‌, లెక్చరర్స్‌కాలనీ, ఆర్టీసీ కాలనీ, హయత్‌నగర్‌.


కిలోమీటరులోపు స్టేషన్‌..

రెండోదశ ప్రాజెక్టులో పలుచోట్ల కిలోమీటరులోపు స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు డీపీఆర్‌లో పేర్కొన్నారు. నాగోల్‌–శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కారిడార్‌లో కిలోమీటరన్నర వరకు నిర్మించనుండగా, ఇందులో ప్రస్తుతం 24 స్టేషన్లు ఉన్నట్లు ప్రకటించారు. అయితే ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు త్వరగా వెళ్లేందుకు 4 స్టేషన్లను కుదించి 20కి పరిమితం చేయనున్నట్లు ప్రాథమికంగా ప్రకటించారు. తద్వారా ఈ మార్గంలో రైలు వేగం గంటకు 40 కిలోమీటర్లు పెరిగే అవకా శం ఉంది. ప్రస్తుతం గంటకు 35 కిలోమీటర్ల వేగంతో మెట్రోరైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.


Also Read:

చెన్నమనేని రమేష్‌‌కు బిగ్ షాక్

ఓవరాక్షన్ చేస్తే ఊరుకోను

శీతాకాలంలో మీ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..

For More Telangana News and Telugu News..

Updated Date - Dec 09 , 2024 | 11:44 AM