Hyderabad: మిస్డ్ కాల్.. ఓ బిజినెస్సే!
ABN, Publish Date - Sep 26 , 2024 | 07:37 AM
మనదేశంలో మిస్డ్ కాల్ సంస్కృతి కొత్త కాదు. ఒకప్పుడు రీచార్జ్(Recharge) ధరలు అధికంగా ఉన్న సమయంలో టెలికాం ఆపరేటర్లు ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ రుసుము విధించేవారు. దీంతో కొందరు మిస్డ్ కాల్ ఇచ్చి మాట్లాడేవారు.
- వ్యాపార అవకాశంగా మలుచుకుంటున్న స్టార్ట్‌పలు
- పార్టీల సభ్యత్వానికి, మన్‌కీ బాత్‌కీ ఓ మిస్డ్ కాల్
- మరికొందరికి ఇది ఇప్పటికీ కోడ్ భాషే
- సర్వేల నుంచి రియాల్టీ షోల విజేతల వరకూ ఇదే సీన్
ఒక్కసారి రీచార్జ్ చేస్తే నెలంతా అన్‌లిమిటెడ్(Unlimited)గా మాట్లాడుకునే రోజులివి. ఈ కాలంలో కూడా మిస్డ్ కాల్ సంస్కృతి నడుస్తోంది. ఇది కొందరికి కోడ్ భాష అయితే.. మరికొన్ని కంపెనీలకు వ్యాపారం. ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండంటూ.. హోరెత్తించే ప్రచారం వెనుక కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుందంటే సాధా రణ విషయం కాదు. రాజకీయ పార్టీల సభ్యత్వానికి, ప్రధానమంత్రి నిర్వహించే మన్‌కీ బాత్‌కీ మిస్డ్ కాల్ వాడుతుండడం గమనార్హం.
హైదరాబాద్ సిటీ: మనదేశంలో మిస్డ్ కాల్ సంస్కృతి కొత్త కాదు. ఒకప్పుడు రీచార్జ్(Recharge) ధరలు అధికంగా ఉన్న సమయంలో టెలికాం ఆపరేటర్లు ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ రుసుము విధించేవారు. దీంతో కొందరు మిస్డ్ కాల్ ఇచ్చి మాట్లాడేవారు. కాలక్రమేణ కంపెనీల మధ్య పోటీపెరగడంతో వినియోగదారులకు తక్కువ రీచార్జ్‌తో అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఇటీవలి కాలంలో మల్టీనేషనల్ కంపెనీలు మిస్డ్ కాల్‌తో వ్యాపారాలు చేయడంతోపాటు వినియోగదారుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నాయి. రియాల్టీ షోలు విజేతలను ఎన్నుకోవడానికి, రాజకీయ పార్టీలు తమ పార్టీ సభ్యత్వాలను కూడా మిస్డ్ కాల్స్‌తోనే చేస్తున్నాయి. అంతేకాదు ఓ మంచి కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలన్నా, అన్యాయాన్ని ఖండించాలన్నా మిస్డ్ కాల్ మార్గమే ఉత్తమమంటున్నారు కొందరు.
ఇదికూడా చదవండి: Nalgonda: పెళ్లి పేరుతో రేప్.. హత్య!
కంపెనీలకు చక్కటి మార్కెటింగ్
సామాన్యులు మిస్డ్‌కాల్‌ను ఒక రకమైన కమ్యూనికేషన్‌గా వినియోగించుకుంటుంటే.. కొన్ని కంపెనీలు దీన్ని మార్కెటింగ్‌గా మలుచుకుంటున్నాయి. ఇప్పుడు క్లౌడ్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మిస్డ్ కాల్స్ వినియోగం పలు కంపెనీల మధ్య బాగా ప్రాచుర్యం పొందింది. మరీ ముఖ్యంగా తాము నిర్వహిస్తున్న ప్రచారాల తీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి, తాము లక్ష్యంగా చేసుకున్న వినియోగదారులను చేరుకోవడానికి కూడా ఈ మిస్డ్ కాల్ సేవలను పలు కంపెనీలు వినియోగించుకుంటున్నాయి. విశేషమేమం టే రెస్టారెంట్లలో టేబుల్ బుక్ చేసుకోవడం మొదలు పలు కార్పొరేట్ హాస్పిటళ్లలో డాక్టర్ అపాయింట్‌మెంట్‌లకూ మిస్డ్ కాల్స్ సేవలను వినియోగిస్తున్నారు.
ప్రతి మిస్డ్ కాల్ ఓ అవకాశమే
సాంకేతికత విచ్చలవిడిగా పెరిగిన ఈ రోజుల్లో కూడా దేశంలో మిస్డ్ కాల్ వ్యాపారం(Missed call business) దాదాపు రూ.900 కోట్ల పైమాటే అంటున్నారు ఓ సోషల్ మీడియా సంస్ధలో పనిచేస్తున్న ప్రతినిధి. జిప్ డయల్ లాంటి సంస్థలు ఈ మిస్డ్ కాల్స్‌తోనే వ్యాపారాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. నిజం చెప్పాలంటే ప్రతి మిస్డ్ కాల్ ఓ వ్యాపార అవకాశమే అని అన్నారు ఓ సుప్రసిద్ధ టెలికాం సంస్థలోని మార్కెటింగ్ హెడ్. ఆదాయపరంగా మిస్డ్ కాల్‌తో కొంత నష్టమే కానీ, కొన్ని వ్యాపార సంస్థలకు నూతన కస్టమర్లను చేరుకోవడానికి, కస్టమర్ డాటా పొందడానికి, తమ ఉత్పత్తుల గురించి అధ్యయనం చేయడానికి తోడ్పడుతుందని తెలిపారు. కొన్ని యాప్‌లు కస్టమర్ వెరిఫికేషన్, కాల్ బ్యాక్ సర్వీ్‌సల కోసం దీన్ని వినియోగించుకుంటుంటే, ఈ-కామర్స్ సంస్థలు ప్రొడక్ట్ ట్రాకింగ్ అవకాశాల కోసం వాడుతున్నాయని చెప్పారు.
అనర్థాలు లేకపోలేదు!
మిస్డ్ కాల్స్ మంచిదేనా అంటే.. మంచి, చెడు ఉందంటున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణుడు అలీ. కొన్ని యాప్‌లు ఫ్లాష్ మెసేజ్‌లు, కాల్స్ ద్వారా వెరిఫై చేస్తున్నాయని, స్కామర్లు కూడా ఒక్కోసారి ఆ విధానం అనుసరిస్తే తెలియని కస్టమర్లు నష్టపోయే ప్రమాదం ఉన్నదని చెప్పారు. మిస్డ్ కాల్స్ వల్ల నెట్‌వర్క్‌పై అనవసర భారం పడి, సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు.
ఒకటి.. రెండు.. మూడు
శ్రీకాకుళం నుంచి నగరానికి వచ్చిన ఓ కుటుంబం కూలీ కోసం అడ్డా వద్ద ఉండేవారు. ఎవరైనా పని ఇస్తామని వస్తే ముందుగా బేరం కుదుర్చుకొని వెళ్తారు. మధ్యలో మాట్లాడాల్సి వస్తే ఫోన్‌లోనే సంభాషిస్తారు. కానీ, ఒక్క కాల్ చేయకుండానే?! అదెలా సాధ్యం అని అంటే.. ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే పని మొదలైందని అర్థం. రెండు మిస్డ్ కాల్స్ ఇస్తే చెప్పిందొకటి, చేయించేది ఇంకోటి అని. మూడుసార్లు మిస్డ్ కాల్స్ ఇస్తే అనవసరంగా వచ్చామని తెలియజేయడం.
ఇదికూడా చదవండి: తిరుమల లడ్డూ వివాదం వెనుక బీజేపీ కుట్ర..
ఇదికూడా చదవండి: కవిత కేసు విచారణ అక్టోబరు 4కు వాయిదా
ఇదికూడా చదవండి: హై‘డ్రామా’లొద్దు..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 26 , 2024 | 07:37 AM