Hyderabad: ఎమ్మెల్యే గాంధీ రాజీనామా చేసి గెలవాలి.. ఆయన గాంధీ పేరుపెట్టుకున్న గాడ్సే
ABN, Publish Date - Nov 20 , 2024 | 10:53 AM
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై శాసనమండలి సభ్యుడు శంబిపూర్ రాజు మండిపడ్డారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేరు పెట్టుకున్న గాడ్సే అని అన్నారు. గాంధీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు.
- ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు
- కేసీఆర్‌ను తిట్టిన వారెవరూ బాగుపడలేదు: ఎమ్మెల్యే కృష్ణారావు
హైదరాబాద్: ఎమ్మెల్యే అరెకపూడి.. గాంధీ పేరుపెట్టుకున్న గాడ్సే అని మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు(MLC Shambipur Raju) అన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచిన గాంధీ దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ తరుఫున పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. ఆల్విన్‌కాలనీ డివిజన్ సీనియర్ నాయకులు ఎర్రవల్లి సతీష్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సొంతిళ్లు నిర్మించుకోవాలని.. పనిచేస్తున్న ఇంటికే కన్నం
ఈసందర్భంగా శంబిపూర్ రాజు మాట్లాడుతూ... మేడ్చల్ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 100శాతం విజయాలు సాధించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన విజయోత్సవ సభ కాదు సంవత్సరికం జరుపుకొంటున్నారని ఎద్దేవ చేశారు. ఏం సాధించారని, ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని సంవత్సర వేడుకలు జరుపుకొంటున్నారని ఆయన ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి మంచి రోజులు వస్తాయని ఎమ్మెల్సీ అన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి..
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ... రాజకీయ ప్రస్థానం ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్ డివిజన్ల నుంచి మొదలైందని, కౌన్సిలర్‌గా గెలుపొంది కూకట్‌పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఎన్నో అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని, దానికి నిదర్శనం హైదరాబాద్‌లో మొన్న జరిగి న అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీని తిట్టడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నా రు.
చరిత్రలో కేసీఆర్‌ను తిట్టిన వారు ఎవరు కూడా బాగుపడలేదన్నారు. నాయకులు మారారే తప్ప... కార్యకర్తలందరూ బీఆర్‌ఎ్‌స పార్టీలో నే ఉన్నారని, కార్యకర్తలకు, నాయకులకు ఎలాం టి ఆపద వచ్చినా తాను అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రోజారంగారావు, జూపల్లి సత్యనారాయణ, కె.జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ రంగారావు, రాములుగౌడ్, రాజు, సమాద్, ఖాజా, జగదీష్, సాయిగౌడ్, మనీ్‌షగౌడ్, మహే ష్, నాగేశ్వరరావు, భద్రయ్య, శంకర్, లక్ష్మణ్, అడ్వకేట్ శ్రీనివాస్, రామస్వామి పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: శబరిమలకు 18 ప్రత్యేక రైళ్లు
ఈవార్తను కూడా చదవండి: చేసింది చెప్పలేక కేసీఆర్‌ను తిడతావా..
ఈవార్తను కూడా చదవండి: మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
ఈవార్తను కూడా చదవండి: సగం పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల్లేవు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 20 , 2024 | 10:53 AM