Hyderabad: పాముతో కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మారావు..
ABN, Publish Date - Jul 02 , 2024 | 09:56 AM
తుకారాంగేట్ పరిధి బోయబస్తీలో (గంగపుత్ర సంఘం ప్రాంతం) నిత్యం పాములు సంచరిస్తున్నాయని, నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని బస్తీవాసులు ఎమ్మెల్యే పద్మారావు(MLA Padmarao)ను కోరారు.
- బోయబస్తీలో పాముల సంచారంపై ఫిర్యాదు
- వీడియోకాల్‌లో అధికారికి చూపించిన ఎమ్మెల్యే
- బస్తీలో రాళ్లు, చెత్తాచెదారం తొలగించాలని ఆదేశం
హైదరాబాద్ సిటీ: తుకారాంగేట్ పరిధి బోయబస్తీలో (గంగపుత్ర సంఘం ప్రాంతం) నిత్యం పాములు సంచరిస్తున్నాయని, నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని బస్తీవాసులు ఎమ్మెల్యే పద్మారావు(MLA Padmarao)ను కోరారు. బస్తీలో సంచరిస్తున్న ఓ నాగుపాము పిల్లను పట్టుకుని ప్లాస్టిక్ బాటిల్‌లో ఉంచి సోమవారం సీతాఫల్‌మండిలోని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. బాటిల్‌లో ఉన్న పాము బుస కొట్టడం చూసి ఎమ్మెల్యే పద్మారావుతో పాటు అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. తమ బస్తీలో పాముల బెడద ఎక్కువగా ఉన్నదని, గతంలో ఒక పాప పాముకాటుతో మృతి చెందిందని బస్తీవాసులు ఎమ్మెల్యేకు వివరించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: జీహెచ్‌ఎంసీలో వింత పరిస్థితి.. అధికారుల మధ్య సమన్వయలోపం
తమ సమస్య గురించి అధికారులకు చెబితే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే సంబంధిత అధికారికి వీడియో కాల్ చేసి బాటిల్‌లో ఉన్న నాగుపామును చూపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తీలో రాళ్ల కుప్పలను, చెత్త, చెట్లను తొలగించాలని, పాములు రాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాముపిల్లను దూరంగా తీసుకెళ్లి వదిలేయాలని బస్తీవాసులకు సూచించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 02 , 2024 | 09:56 AM