Hyderabad: మోత్కుపల్లి.. కాదు ఉసరవెల్లి!
ABN, Publish Date - May 08 , 2024 | 11:18 AM
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు(Former Minister Motkupalli Narsimhulu) తన ఇంటి పేరును ‘ఉసరవెల్లి’గా మార్చుకుంటే పేరుకు తగినట్టు అర్థవంతంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు డి.శ్రీశైలం వ్యాఖ్యానించారు.
- కాంగ్రెస్ నాయకుడు శ్రీ శైలం
హైదరాబాద్: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు(Former Minister Motkupalli Narsimhulu) తన ఇంటి పేరును ‘ఉసరవెల్లి’గా మార్చుకుంటే పేరుకు తగినట్టు అర్థవంతంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు డి.శ్రీశైలం వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లిపై శ్రీశైలం నిప్పులు చెరిగారు. ఇటీవలే శ్రీశైలం తెలంగాణ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదివికి రాజీనామా చేసి సీఎం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy)ని తీవ్రంగా దుర్భాషలాడుతూ మోత్కుపల్లి ట్విట్టర్‌లో చేసిన పోస్టుపై శ్రీశైలం అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదికూడా చదవండి: PM Modi: రాజన్నకు ప్రధాని మోదీ కోడె మొక్కు
మాదిగల హక్కుల కోసం మాట్లాడుతున్న మో త్కుపల్లి గతంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు ఏమి న్యాయం చేశారని ప్రశ్నించారు. ఒక్క మాదిగ కైనా ఆయన మేలు చేశారా..? అని నిలదీశారు. మోత్కుపల్లి సీఎంపై చేసిన ఆరోపణలకు క్ష్లమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మాదిగలు మోత్కుపల్లిని కుల బహిష్కరణ చేస్తారని ఆయన హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలుచేసిన మోత్కుపల్లి నర్సింహులుపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని శ్రీశైలం కోరారు.
ఇదికూడా చదవండి: Hyderabad: డీసీపీపై బీజేపీ నేతల ఫిర్యాదు
Read Latest Telangana News and National News
Read Latest National News and Telugu News
Updated Date - May 08 , 2024 | 11:18 AM