ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad : ఏడాదిలో 300 రోబోటిక్‌ సర్జరీలు

ABN, Publish Date - Aug 14 , 2024 | 06:00 AM

ఒక్క ఏడాదిలోనే 300 రోబోటిక్‌-సహాయక శస్త్రచికిత్స(ఆర్‌ఏఎ్‌స)లను పూర్తిచేసి నిమ్స్‌ అరుదైన ఘనతను సాధించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆస్పత్రిగా నిలిచింది.

  • అరుదైన ఘనత సాధించిన నిమ్స్‌

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఒక్క ఏడాదిలోనే 300 రోబోటిక్‌-సహాయక శస్త్రచికిత్స(ఆర్‌ఏఎ్‌స)లను పూర్తిచేసి నిమ్స్‌ అరుదైన ఘనతను సాధించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆస్పత్రిగా నిలిచింది. యూరాలజీ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్‌ సర్జరీ, సర్జికల్‌ ఆంకాలజీ విభాగాలలో అనేక క్లిష్టమైన శస్త్ర చికిత్సల్ని ఆర్‌ఏఎస్‌ ద్వారా చేశారు.

ఈ సాంకేతికత కారణంగా ఆస్పత్రిలో రోగి గడిపే సమయం గణనీయంగా తగ్గిందని, డాక్టర్లు ప్రతిరోజూ ఎక్కువ కేసులకు హాజరుకాగలుగుతున్నారని నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప నగరి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ అధునాతన చికిత్సా విధానాలను అందించడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ సహాయ సహకారాలున్నాయన్నారు.

కాగా, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ సర్జరీలు, పాక్షిక నెఫ్రెక్టమీ, రాడికల్‌ నెఫ్రెక్టమీ, రాడికల్‌ సిస్టెక్టమీ, పైలోప్లాస్టీ, యూరిటెరల్‌ రీఇంప్లాంటేషన్‌, రాడికల్‌ కోలిసిస్టెక్టమీ, లార్జ్‌ డిఫెక్ట్‌ వెంట్రల్‌ హెర్నియా, తదితర సర్జరీలు ఆర్‌ఏఎస్‌ ద్వారా చేపట్టారు.

Updated Date - Aug 14 , 2024 | 07:00 AM

Advertising
Advertising
<