Hyderabad: బాసరలో గోదావరికి నిత్యహారతి..
ABN, Publish Date - Jun 23 , 2024 | 11:16 AM
కాశీ పుణ్యక్షేత్రంలో నిరంతరాయంగా జరుగుతున్న గంగా హారతి మాదిరిగా గోదావరి పరివాహక ప్రాంతంలో వెలసిన బాసర(Basara) పుణ్యక్షేత్రంలో నిత్య గంగా (గోదావరి) హారతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్లు నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ వేద భారతీ పీఠం పండితుడు, అధ్యాపకుడు గురుచరణ్ తెలిపారు.
హైదరాబాద్: కాశీ పుణ్యక్షేత్రంలో నిరంతరాయంగా జరుగుతున్న గంగా హారతి మాదిరిగా గోదావరి పరివాహక ప్రాంతంలో వెలసిన బాసర(Basara) పుణ్యక్షేత్రంలో నిత్య గంగా (గోదావరి) హారతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్లు నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ వేద భారతీ పీఠం పండితుడు, అధ్యాపకుడు గురుచరణ్ తెలిపారు. వేద విద్యానంద గిరి స్వామి బాసరలో వేద భారతీ పీఠం అభివృద్థి ట్రస్టును ఏర్పాటుచేసి వేద పాఠశాల, గోశాల, నిత్య గంగా (గోదావరి) హారతి నిర్వహిస్తున్నారని అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్(Somajiguda Press Club)లో ఏర్పాటుచేసిన సమావేశంలో వేదాల విశిష్టతను వివరిస్తూ వేద విద్యానంద గిరి స్వామి రచించిన ఇంటింటా వేదం పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఇదికూడా చదవండి: Legal Notice: హుజురాబాద్ ఎమ్మెల్యేకు నోటీసులు.. ఎందుకంటే..?
అనంతరం మాట్లాడుతూ లోక కల్యాణం కోసం వేద పీఠాన్ని ప్రారంభించి హైందవ ధర్మ పరిరక్షణకు వేద విద్యానంద గిరి స్వామి ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వేద పాఠశాలలో 80 మంది విద్యార్థులు వేదాలను అభ్యసిస్తున్నారని, ప్రభుత్వం సహాయం చేస్తే మరింత అభివృద్థి చేసి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుతామని అన్నారు. సమావేశంలో ట్రస్ట్ వలంటీర్లు మల్లేష్ రెడ్డి, సురేష్, విజయ్‌పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 23 , 2024 | 11:16 AM