ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మెరిట్‌కూ దక్కలేదు! డీఎస్సీలో క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు నిరాశ

ABN, Publish Date - Oct 08 , 2024 | 12:00 PM

డీఎస్సీ పరీక్షల విభాగం అధికారుల నిర్లక్ష్యంతో ఇద్దరు క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. పరీక్షలో మెరిట్‌ ర్యాంకు సాధించామని.. ఇన్నాళ్లూ కలలు కన్న ఉద్యోగం తప్పకుండా వస్తుందని ఆశల పల్లకిలో ఊరేగుతున్న వారి ఆశలు అడియాసలయ్యాయి.

- 1:3లో ఎంపికైనా.. ఉద్యోగాలు దక్కని పరిస్థితి

- దరఖాస్తుల సమయంలో సరిగా పరిశీలించని పరీక్షల విభాగం

- మెరిట్‌ సాధించిన తర్వాత అర్హులు కారంటూ వెనక్కి పంపిన వైనం

- బోరున విలపిస్తూ ఇంటిబాట పట్టిన మహిళా అభ్యర్థులు

హైదరాబాద్‌ సిటీ: డీఎస్సీ పరీక్షల విభాగం అధికారుల నిర్లక్ష్యంతో ఇద్దరు క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. పరీక్షలో మెరిట్‌ ర్యాంకు సాధించామని.. ఇన్నాళ్లూ కలలు కన్న ఉద్యోగం తప్పకుండా వస్తుందని ఆశల పల్లకిలో ఊరేగుతున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. ‘‘సారీ.. మీ అర్హత ఇక్కడ చెల్లు బాటు కాదు’’ అంటూ అధికారులు చెప్పి వెనక్కి పంపించడంతో బోరున విలపిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చని భావిస్తున్న సమయంలోనే దేవుడు దానిని దూరం చేశాడని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఏడాది జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌(Hyderabad) జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్‌, ఎస్‌జీటీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌(పీఈటీ) కేటగిరీల్లో 878 ఖాళీలకు పరీక్షలు నిర్వహించారు. ఆయా పోస్టులకు 27,360 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. 1:3 ప్రాతిపదికన 2,634 మందిని ఎంపికచేశారు.

ఈ వార్తను కూడా చదవండి: MLA: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..


నాన్‌లోకల్‌ పేరిట ఒకరిని.. సర్టిఫికెట్‌ చెల్లదని మరొకరిని..

డీఎస్సీలో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 1 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించారు. ప్రభుత్వ మోడల్‌ ఆలియా హైస్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్లు, ఆబిడ్స్‌లోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్‌జీటీలు, పీఈటీల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేశారు. ఇద్దరు మహిళా అభ్యర్థుల అర్హతను తిరస్కరించడంతో బోరున విలపిస్తున్నారు. నిర్మల్‌ జిల్లాకు చెందిన యాస్మిన్‌ ఖానమ్‌ హైదరాబాద్‌ జిల్లాలో ఓపెన్‌ కేటగిరీలో ఖాళీగా ఉన్న 8 ఉర్దూ లాంగ్వేజ్‌ పోస్టుల నోటిఫికేషన్‌ను చూసి దరఖాస్తు చేసుకుంది. పరీక్షలో ఆమె 78.37 మార్కులతో జిల్లా ఫస్ట్‌ ర్యాంకు సాధించింది.


సర్టిఫికెట్ల పరిశీలన నేపథ్యంలో ఆమెకు ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఈనెల 2న సంబంధిత కేంద్రానికి వచ్చి ఆరా తీసింది. హైదరాబాద్‌ జిల్లాలో నాన్‌లోకల్‌ పోస్టులు లేకపోవడంతో మీరు అర్హత సాధించలేకపోయారని అధికారులు చెప్పడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది. ఓపెన్‌ కేటగిరీలో ఉన్న మొత్తం పోస్టుల్లో 95 శాతం లోకల్‌, 5 శాతం ఓపెన్‌ కేటగిరీ ఉంటుందని.. మొత్తం 11 పోస్టులు నోటిఫికేషన్‌లో చూపించి ఉంటే మీరు తప్పకుండా ఉద్యోగానికి ఎంపికయ్యేవారని అధికారులు చెప్పినట్లు ఆమె తెలిపారు.


నగరంలోని కాళీమందిర్‌ ప్రాంతానికి చెందిన రాజేశ్వరి ఎస్‌జీటీ కేటగిరీలో 1:3 కింద ఎంపికైంది. ఈనెల 2వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లగా ఆమెకు నిరాశ ఎదురైంది. డీఈడీ కింద ఆమె చదివిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ సర్టిఫికెట్‌ చెల్లుబాటు కాదని చెప్పడంతో అక్కడే గుండెలవిసేలా రోదించింది. డీఎస్సీలో తనకు వచ్చిన 65.38 మార్కులతో ఉద్యోగం వస్తుందని భావించానని, అంతలోనే డీఈడీ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ చెల్లదని చెప్పడంతో ఏం చేయాలో తెలియడం లేదని ఆమె విలపిస్తూ చెప్పారు.


డీఎస్సీ విభాగం నిర్లక్ష్యంతో..

వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం లోకల్‌, నాన్‌లోకల్‌ కింద అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న సమయంలోనే వారి స్థానికత, సర్టిఫికెట్లను డీఎస్సీ విభాగం పరిశీలించాలి. అయితే సంబంధిత విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తప్పిదాలు జరిగాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అర్హత లేనివారి దరఖాస్తులను ముందుగానే తిరస్కరించి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదన్నారు. దరఖాస్తుల స్వీకరణను సరిగా పట్టించుకోకపోవడంతోనే తప్పిదాలు జరిగాయన్నారు. ఏది ఏమైనా టీచర్‌ ఉద్యోగం కోసం కంటిమీద కునుకు లేకుండా కష్టపడిన ఇద్దరు అభ్యర్థులకు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

.


............................................................

ఈ వార్తను కూడా చదవండి:

.............................................................

Secunderabad: వందేభారత్‌ రైలుకు ఉత్తుత్తి బాంబు బెదిరింపు..

- పోలీసుల అదుపులో మతిస్థిమితం లేని వ్యక్తి

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌(Secunderabad Railway Station) నుంచి బయలుదేరే వందేభారత్‌ రైల్లో(Vande Bharat train) బాంబు పెట్టానని ఓ అజ్ఞాతవ్యక్తి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌చేసి బెదిరించాడు. దీంతో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ పోలీసులు గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన గోపాలపురం పోలీసులు ప్రత్యేక బృందంతో కలిసి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లి తనిఖీలు చేశారు. అయితే, ఆ సమయంలో వందేభారత్‌ రైలు లేకున్నా, ముందస్తుగా తనిఖీలు చేపట్టారు. ఆపై అజ్ఞాతవ్యక్తి చేసిన ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా కొద్దిగంటల్లోనే నిందితుడిని పట్టుకోగలిగారు. నిందితుడు కొండాపూర్‌కు చెందిన మధుసూదన్‌(Madhusudan)గా పోలీసులు గుర్తించారు. అయితే, పోలీస్‌ స్టేషన్లో అతన్ని విచారించిన పోలీసులు, నిందితుడిని మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌కు ఫోన్‌చేసి బెదిరించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు గోపాలపురం పోలీసులు తెలిపారు.


ఇదికూడా చదవండి: Harish Rao: జర్నలిస్టులకు సర్కారు దసరా కానుక ఇదేనా?

ఇదికూడా చదవండి: Hyderabad: త్వరలో టీడీపీలోకి తీగల

ఇదికూడా చదవండి: Police Department: అవినీతి ఐపీఎస్‌లపై కొరడా!

ఇదికూడా చదవండి: Gold Prices Today: గుడ్ న్యూస్.. దిగొచ్చిన పసిడి ధరలు..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 08 , 2024 | 12:00 PM