ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ప్రధాని సభ సందర్భంగా.. ఎల్‌బీస్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN, Publish Date - May 10 , 2024 | 10:31 AM

పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‏రెడ్డి(CP Kothakota Srinivas Reddy) ఓ ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్‌ సిటీ: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‏రెడ్డి(CP Kothakota Srinivas Reddy) ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఎల్‌బీస్టేడియం వరకు వచ్చే సమయంలో పీఎన్‌టీ ఫైఓవర్‌, గ్రీన్‌లాండ్స్‌, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌మార్గ్‌, తెలుగుతల్లి జంక్షన్‌, రవీంద్రభారతి రూట్‌లో వాహనాలను అనుమతించరు. సభ పూర్తయిన తర్వాత ప్రధాని ఇదే మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి వెళ్లే సమయంలో కూడా వాహనాలను అనుమతించరు.

ఇదికూడా చదవండి: KCR: నేటితో ముగియనున్న కేసీఆర్ బస్సు యాత్ర

సభకు భారీగా జనం హాజరయ్యే అవకాశం ఉండడంతో ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో వాహనాలను నిలిపేయడంగానీ, దారి మళ్లించడంగానీ చేస్తామని తెలిపారు. ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ జంక్షన్‌ నుంచి బీజేఆర్‌ స్టాచ్యూ వైపు వాహనాలను అనుమతించరు. సుజాత స్కూల్‌ వైపు నుంచి లతీఫ్ ఖాన్‌ బిల్డింగ్‌ వైపునకు వాహనాలను అనుమతించరు. రవీంద్రభారతి వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను పబ్లిక్‌ గార్డెన్‌, నాంపల్లి వైపునకు పంపుతారు. ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షలను గమనించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి రద్దీని నివారించాలని కోరారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రేపు ఆఖరు.. సాయంత్రం 6 గంటలకు ముగియనున్న ప్రచారం

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 10 , 2024 | 10:34 AM

Advertising
Advertising