Hyderabad: ఉస్మానియా వర్శిటీ గేట్లు రాత్రి 9 తర్వాతే బంద్
ABN, Publish Date - Nov 26 , 2024 | 08:43 AM
ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) ప్రధాన గేట్లను రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచాల్సిందిగా వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.కుమార్(Vice Chancellor Professor M. Kumar) భద్రతా సిబ్బందిని ఆదేశించారు. అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వీసీ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్ సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) ప్రధాన గేట్లను రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచాల్సిందిగా వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.కుమార్(Vice Chancellor Professor M. Kumar) భద్రతా సిబ్బందిని ఆదేశించారు. అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వీసీ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉస్మానియా వర్సిటీ ప్రధాన గేట్లు (ఎన్‌సీసీ వైపు, పోలీస్ స్టేషన్ వైపు) రాత్రి 8 గంటలకు మూసివేస్తుండగా.. తాజా నిర్ణయంతో మరో గంట అదనంగా వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించారు.
ఈ వార్తను కూడా చదవండి: Cyber criminals: కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ‘సైబర్’ వల.. రూ.1.32 లక్షలు గోవిందా..
రామంతాపూర్(Ramanthapur) వైపుగా ఉన్న రవీంద్రనగర్ కాలినడక ద్వారం నుంచి కూడా రాకపోకలకు ఉదయం, సాయంత్రం కొంత వెసులుబాటు కల్పించారు. ఓయూలో పలు నిర్మాణాలు జరుగుతుండడంతో అక్కడే నివాసముంటున్న కూలీల పిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు వీలుగా పాఠశాల సమయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Shamshabad: బ్యాంకాక్ నుంచి బ్యాగుల్లో పాములు
ఈవార్తను కూడా చదవండి: Goshmahal: మలక్‌పేటకు గోషామహల్ స్టేడియం
ఈవార్తను కూడా చదవండి: Solar Panels: సోలార్ ప్యానల్స్‌తో మేలుకన్నా హాని ఎక్కువ
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే..
Read Latest Telangana News and National News
Updated Date - Nov 26 , 2024 | 08:43 AM