Hyderabad: ఉస్మాన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ తారుమారు..
ABN, Publish Date - Dec 19 , 2024 | 09:32 AM
ఉస్మాన్‌సాగర్(Osman Sagar) పూర్తి నీటి నిల్వ సామర్థ్యం(ఎఫ్‌టీఎల్) తారుమారు చేసిన విషయంలో సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ నిర్ణయించింది.
- అధికారులపై చర్యలకు పురపాలక శాఖ ఆదేశం
హైదరాబాద్ సిటీ: ఉస్మాన్‌సాగర్(Osman Sagar) పూర్తి నీటి నిల్వ సామర్థ్యం(ఎఫ్‌టీఎల్) తారుమారు చేసిన విషయంలో సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ నిర్ణయించింది. తనిఖీ కమిటీలోని అధికారులకు భారీ పెనాల్టీ విధించాలని పేర్కొంటూ జారీ చేసిన ఆదేశాల ప్రతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉస్మాన్‌సాగర్ ఎఫ్‌టీఎల్(Osmansagar FTL) పరిధిలో నిర్మాణాలను గుర్తించేందుకు జూన్ 2015లో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సంయుక్త తనిఖీ కమిటీని నియమించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అనుమతి నుంచి రెన్యూవల్ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే..
ఇందులో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సూపరింటెండెంట్ ఇంజనీర్ టి. వెంకటేశం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భీమ్‌ప్రసాద్, వాటర్‌బోర్డు సీజీఎం విజయ్‌కుమార్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ నార్త్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై. శేఖర్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎస్‌జీడీసీ అండ్ ఆర్‌డీఓ సురేష్ పొద్దార్ సభ్యులుగా ఉన్నారు. ఉస్మాన్‌సాగర్(Osman Sagar)లోని ఓరో స్పోర్ట్స్, సీహెచ్ అనిల్‌కుమార్, ఎస్. అనుపమకు చెందిన నిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌పరిధిలోకి రావని తప్పుడు నివేదిక ఇచ్చారని హైడ్రా పరిశీలనలో తేలింది.
ఈ విషయాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి యం. దానకిషోర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్‌టీఎల్ తారుమారు చేసిన కమిటీలోని సభ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పునర్విచారణ జరిపిన అధికారులు.. నివేదికలో తప్పులున్నట్టు గుర్తించారు. కమిటీలోని సభ్యులకు భారీ జరిమానా విధించాలని, సీసీఏ రూల్స్ ప్రకారం సెక్షన్ 20 కింద చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ విభాగాన్ని కోరారు.
ఈవార్తను కూడా చదవండి: Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన
ఈవార్తను కూడా చదవండి: పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth: ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు
ఈవార్తను కూడా చదవండి: నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు..
Read Latest Telangana News and National News
Updated Date - Dec 19 , 2024 | 09:32 AM