Hyderabad: ‘ప్రజావాణి’లో ఆంక్షలు షురూ..

ABN, Publish Date - Nov 05 , 2024 | 10:39 AM

తమ సమస్యలను ప్రజావాణిలో విన్నవించేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) కార్యాలయాలకు వచ్చేవారిపై అధికారులు ఆంక్షలు విధించారు. సెల్‌ఫోన్లు(Cell phones) తీసుకురావొద్దని, టోకెన్‌ లేకుంటే ప్రజావాణి సమావేశ మందిరంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు ఇబ్బందులు పడ్డారు.

Hyderabad: ‘ప్రజావాణి’లో ఆంక్షలు షురూ..

- సెల్‌ఫోన్లకు అనుమతి లేదు..

- టోకెన్‌ ఉంటేనే లోపలికి

హైదరాబాద్‌ సిటీ: తమ సమస్యలను ప్రజావాణిలో విన్నవించేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) కార్యాలయాలకు వచ్చేవారిపై అధికారులు ఆంక్షలు విధించారు. సెల్‌ఫోన్లు(Cell phones) తీసుకురావొద్దని, టోకెన్‌ లేకుంటే ప్రజావాణి సమావేశ మందిరంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు ఇబ్బందులు పడ్డారు. సమయం ముగిసిందంటూ లోపలికి వచ్చేందుకు యత్నించిన పలువురిని సిబ్బంది బయటకు పంపించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి మొదలవుతుందని జీహెచ్‌ఎంసీ ప్రకటించినా, ఆ సమయానికి పూర్తిస్థాయి లో అధికారులు అందుబాటులో ఉండరు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పట్టాలపై పరేషాన్‌.. మెట్రో రాకపోకల్లో అంతరాయం


city3.2.jpg

కానీ మధ్యాహ్నం 1 గంట కాగానే.. అప్పటి వరకు నిరీక్షించిన ప్రజల ఫిర్యాదులూ స్వీకరించకుండా వెళ్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కౌంటర్‌లో మొబైల్‌ ఫోన్‌ డిపాజిట్‌(Mobile phone deposit) చేసి.. అక్కడ ఇచ్చే టోకెన్‌(Token) తీసుకొని ప్రజావాణికి రావాల్సి ఉంటుంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు పట్టించుకోవడం లేదంటూ గతవారం జరిగిన ప్రజావాణిలో ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడంతోపాటు అధికారుల అక్రమాలపై మండిపడ్డాడు. దీంతో అప్రమత్తమైన బల్దియా అధికారులు ఆంక్షలను అమల్లోకి తెచ్చారు.


కేవలం 35 ఫిర్యాదులే..

సోమవారం ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణికి 35 ఫిర్యాదులు రాగా.. అందులో 19 పట్టణ ప్రణాళికా విభాగానికి చెందినవే. జోనల్‌ కార్యాలయాల్లో మరో 80 ఫిర్యాదులు వచ్చాయి. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కొద్దిసేపు పౌరుల నుంచి వినతులు స్వీకరించారు. కమిషనర్‌ ఇలంబరిది ఎన్నికల విధుల్లో భాగంగా జార్ఖండ్‌ వెళ్లడంతో ఇన్‌చార్జి వ్యవహరిస్తున్న శివకుమార్‌నాయుడు, ఇతర విభాగాధిపతులు ప్రజావాణిలో పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Unsafe Abortions: విచ్చలవిడిగా గర్భవిచ్ఛిత్తి!

ఈవార్తను కూడా చదవండి: 24 గంటల విద్యుత్‌ అంటూ మోసం: హరీశ్‌రావు

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్‌, హరీశ్‌ ఇళ్ల ముందు ధర్నా చేయండి

ఈవార్తను కూడా చదవండి: అసంక్రమిత వ్యాధులకు ప్రత్యేక క్లినిక్‌లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 05 , 2024 | 10:39 AM