Hyderabad: ట్రాఫిక్ పోలీసుల ‘చిల్లర’ దందా!
ABN, Publish Date - Sep 24 , 2024 | 09:57 AM
కూకట్‌పల్లి నుంచి కేపీహెచ్‌బీ(Kukatpally to KPHB) వెళ్లే దారిలో ప్రముఖ హాస్పిటల్ సమీపంలో రోడ్డుపక్కన ఓ చిరు వ్యాపారి పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆయనతో పాటు ఆ దారిలో చాలామంది చిరు వ్యాపారులు రోడ్డు పక్కన వ్యాపారం చేస్తున్నారు.
- డబ్బులిస్తేనే ఫుట్‌పాత్‌పై అడ్డా
- లేకుంటే చిన్న వ్యాపారులకు వేధింపులు పక్కా
- మామూళ్ల కోసం క్షేత్రస్థాయి సిబ్బంది అడ్డగోలు వ్యవహారం
- కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
హైదరాబాద్ సిటీ: కూకట్‌పల్లి నుంచి కేపీహెచ్‌బీ(Kukatpally to KPHB) వెళ్లే దారిలో ప్రముఖ హాస్పిటల్ సమీపంలో రోడ్డుపక్కన ఓ చిరు వ్యాపారి పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆయనతో పాటు ఆ దారిలో చాలామంది చిరు వ్యాపారులు రోడ్డు పక్కన వ్యాపారం చేస్తున్నారు. రయ్‌మని అక్కడికి వచ్చిన ట్రాఫిక్ పోలీస్ వాహనంలోని సిబ్బంది పండ్ల వ్యాపారి బుట్లలోని పండ్లన్నీ వాహనంలో వేశారు. వ్యాపారి లబోదిబో అంటూ పోలీసులను వేడుకున్నా పండ్ల బుట్టలు ఇవ్వలేదు. ‘రోడ్డు పక్కన వ్యాపారం ఏంటి’ అని దురుసుగా ప్రవర్తించి వాహనంలో ఎక్కి వెళ్లిపోయారు. ట్రాఫిక్ పోలీసులు వాహనంలోనే కూర్చున్నారు. అక్కడ వరుసగా పదుల సంఖ్యలో వ్యాపారులు ఉన్నా.. కేవలం ఒక్కరినే టార్గెట్ చేశారు. ఎందుకిలా జరిగిందని ఆరా తీయగా ‘వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. అందుకే ఇలా చేశారు’ అని ఆ వ్యాపారి వాపోయాడు.
ఇదికూడా చదవండి: Hyderabad: గోవా కేంద్రంగా బెట్టింగ్ దందా.. ఏజెంట్ అరెస్టు
ఈ పరిస్థితి కేవలం కూకట్‌పల్లి, కేపీహెబీకే పరిమితం కాలేదు. ట్రై కమిషనరేట్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఈ తరహా దందా కొనసాగుతోంది. ఒకవైపు ప్రధానరోడ్లన్నీ ఆక్రమణకు గురై ట్రాఫిక్‌జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే.. అది పట్టించుకోకుండా మామూళ్ల మత్తులో జోగుతున్న కొందరు పోలీసులు ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అందినంతా దండుకుంటూ ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నారు. డబ్బులిస్తే ఉంచేయ్.. లేదంటే దించెయ్ అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు.
మామూళ్ల మత్తు.. ట్రాఫిక్ చిత్తు..
మహా నగరంలో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ ట్రాఫిక్ ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. ఉన్నతాధికారుల నియంత్రణ అంతగా లేకపోవడంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది ట్రాఫిక్‌ను గాలికొదిలేస్తున్నారు. కొందరు కేవలం వాహనాల ఫొటోలు తీసి, చలానాలు వేయడానికే పరిమితం అవుతున్నారు.
డబ్బులిస్తేనే ఫుట్‌పాత్ అడ్డా..
ట్రై కమిషనరేట్స్ పరిధిలోని పలు ట్రాఫిక్ డివిజన్‌లలో కొందరు పోలీసులు మామూళ్ల మత్తులో పడి ట్రాఫిక్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్డు ఆక్రమణలను పట్టించుకోకుండా మామూళ్ల వసూళ్లకు దిగుతూ ఆక్రమణదారుల నుంచి అందినంత దండుకుంటున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాలతో రోడ్లన్నీ నిండిపోతుండగా.. కొన్ని ప్రాంతాల్లో ఉన్న కొద్దిపా టి రోడ్లను సైతం చిరు వ్యాపారులు, ఫుడ్ కోర్డులు, హోటళ్లు, ఇతర వ్యాపారస్థులు, ఆక్రమణదారులు కబ్జా చేస్తున్నారు. వారి వద్ద నయానో భయానో డబ్బులు తీసుకుంటున్న క్షేత్రస్థాయి ట్రాఫిక్ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కొంతమంది ట్రాఫిక్ పోలీసులు మా త్రం.. ఎవరైనా వ్యాపారి మామూళ్లు ఇవ్వకపోతే వారిని ఆ చుట్టుపక్కల ఎక్కడా వ్యాపారం చేసుకోనివ్వకుండా వేధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలకు గురై ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా, మామూళ్ల మత్తులో జోగుతున్న ట్రాఫిక్ సిబ్బంది ఆక్రమణలను పట్టించుకోవడంలేదు. ప్రతినెలా ఆక్రమణదారుల నుంచి రూ.లక్షల్లో దండుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ దందా సిటీ నార్త్‌జోన్, సౌత్‌జోన్, సౌత్‌వెస్టు, సౌత్‌ఈస్టుజోన్‌లతో పాటు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఖరీదైన డివిజన్‌లలో జోరుగా సాగుతోంది.
ఇదికూడా చదవండి: Congress: డీసీసీ కార్యాలయాలకు స్థలాలు!
ఇదికూడా చదవండి: Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌కు వరల్డ్ బ్యాంక్ నిధులు..
ఇదికూడా చదవండి: Hanumakonda: కొడుకులు తిండి పెట్టట్లేదు.. మా భూమిని తిరిగి ఇప్పించండి సారూ!
Read Latest Telangana News and National News
Updated Date - Sep 24 , 2024 | 09:57 AM