ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Smuggling: బంగారం ముక్కలను సంచుల్లో దాచి.. బస్సులో అక్రమంగా తరలింపు

ABN, Publish Date - Jul 08 , 2024 | 03:47 AM

బంగారాన్ని ముక్కలుగా చేసి, ప్రత్యేక సంచుల్లో దాచి బస్సులో రహస్యంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు పట్టుకున్నారు.

  • ఇద్దరి అరెస్టు.. రూ. 2.98 కోట్ల బంగారం స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): బంగారాన్ని ముక్కలుగా చేసి, ప్రత్యేక సంచుల్లో దాచి బస్సులో రహస్యంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఆదివారం విశ్వసనీయ సమాచారంతో కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ బస్సులో తనిఖీలు చేసిన అధికారులు ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకంగా కుట్టిన సంచుల్లో బంగారాన్ని దాచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 3.98 కిలోల బరువున్న ఆ బంగారం విలువ సుమారు రూ. 2కోట్ల 89లక్షలు ఉంటుందని తెలిపారు. విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉండటం, తనిఖీలు ఎక్కువగా కావడంతో సరఫరాదారులు అక్రమంగా దిగుమతి చేసుకున్న బంగారాన్ని పలు రకాలుగా తరలిస్తున్నారని చెప్పారు.


ఎవరికీ అనుమానం రాకుండా రైళ్లలో, బస్సులో సాధారణ ప్రయాణికుల మాదిరి బ్యాగుల్లో, దుస్తుల్లో దాచి గమ్యానికి చేరవేస్తున్నారని తెలిపారు. పట్టుబడిన వ్యక్తులు కోల్‌కతాకు చెందిన ఓ ముఠాకు చెందిన వారిగా గుర్తించామని, వారు బంగారాన్ని ఎవరికి చేరవేస్తున్నారో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. దీని వెనుక ఎవరెవరున్నారనే కోణంలోనూ కేసును విచారిస్తున్నామని పేర్కొన్నారు

Updated Date - Jul 08 , 2024 | 03:47 AM

Advertising
Advertising
<