ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: రూ.50 లక్షల వైద్యం.. నిమ్స్‌లో ఉచితం

ABN, Publish Date - Sep 24 , 2024 | 08:50 AM

పిల్లలు గౌచర్‌.. పాంపే వంటి అరుదైన, జెనెటిక్‌ జబ్బుల బారిన పడితే వారికి జీవితాంతం ఖరీదైన మందులు ఇవ్వాల్సిందే. ఆ తరహా బాధితుల్లో ఎదుగుదల సరిగా ఉండదు. మానసిక పరిపక్వత అంతంత మాత్రమే.

- అరుదైన జబ్బులతో బాధపడే పిల్లలకు ప్రత్యేక విభాగం

హైదరాబాద్‌ సిటీ: పిల్లలు గౌచర్‌.. పాంపే వంటి అరుదైన, జెనెటిక్‌ జబ్బుల బారిన పడితే వారికి జీవితాంతం ఖరీదైన మందులు ఇవ్వాల్సిందే. ఆ తరహా బాధితుల్లో ఎదుగుదల సరిగా ఉండదు. మానసిక పరిపక్వత అంతంత మాత్రమే. వెంటనే చికిత్స అందించకపోతే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడవచ్చు. చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈక్రమంలో జెనెటిక్‌, అరుదైన జబ్బులకు చికిత్స అందించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ పాలసీని ఫర్‌ రేర్‌ డిసీజ్‌ (ఎన్‌సీఆర్‌డీ) పాలసీ తీసుకు వచ్చింది. ఈ పాలసీని ఇప్పుడు నిమ్స్‌(Nims)లో అమలు చేస్తున్నారు. జెనెటిక్‌, అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లలకు చికిత్స అందించేందుకు ప్రత్యేక వార్డు, వైద్యులు, పడకలను ఏర్పాటు చేశారు.


జెనెటిక్‌ విభాగంలో..

సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌, డయాగ్నోస్టిక్‌ సహకారంతో నిమ్స్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ జెనెటిక్‌ విభాగంలో ఈ డే-కేర్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ బీరప్ప నగరి తెలిపారు. గౌచర్‌, పాంపే వంటి అరుదైన, జెనెటిక్‌ వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు.


ఒక్కొక్కరికీ రూ.50 లక్షలు

ఎన్‌సీఆర్‌డీ పాలసీ ప్రకారం అరుదైన, జెనెటిక్‌ వ్యాధులతో బాధపడే ఒక్కో వ్యక్తి చికిత్సకు రూ.50 లక్షలను సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ మినిస్ట్రీ నుంచి నిధులు కేటాయిస్తారు. దీంతో బాధితులకు ఉచితంగానే ఇక్కడ చికిత్స అందుతుంది. ప్రస్తుతం గౌచర్‌ వ్యాధితో బాధపడుతున్న 26 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. ఇది జెనెటిక్‌ సమస్య వల్ల వచ్చే వ్యాధని, సాధారణ మందులతో పాటు ఐవీ ఇన్ఫ్యూజన్‌ ఇవ్వాల్సి ఉంటుందని నిమ్స్‌ జెనెటిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ షుగున్‌ అగర్వాల్‌ వివరించారు. ఈ సమస్య ఉన్నవారిలో ప్లీహం పెద్దగా కావడం, కాలేయం పనిచేయక పోవడం, నాడీ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతుంటారు. ఈ జబ్బు సాధారణంగా 2 నుంచి 12 ఏళ్ల వయస్సు పిల్లలకు వస్తుందని అగర్వాల్‌ తెలిపారు.


పిల్లల వైద్యులు గుర్తించాలి

అరుదైన, జెనెటిక్‌ వ్యాధులతో బాధపడే పిల్లలకు జీవితాంతం మందులు ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా పిల్లల వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు ఈ జబ్బును గుర్తిస్తారని, జెనెటిక్‌, అరుదైన వ్యాధి లక్షణాలు ఉంటే తమ వద్దకు పంపిస్తారని అగర్వాల్‌ చెప్పారు. నిలోఫర్‌, ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి వస్తున్నారని తెలిపారు. పిల్లల బరువు, వయస్సును బట్టి చికిత్సలు అందించాల్సి ఉంటుందన్నారు. చాలా ఖరీదైన మందులు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.


పాంపే డిసీజ్‌..

ఈ జబ్బుతో బాధపడే వారికి గుండె, కాలేయంలో వాపు వస్తుంది. దీని వల్ల పిల్లలకు గుండె వైఫల్యం చెందే అవకాశం ఉంది. మెరుగైన చికిత్స అందించకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు. పుట్టిన ఏడాది నుంచి ఆరేళ్ల వయస్సు పిల్లలకు ఈ జబ్బు వస్తుందని, ప్రస్తుతం ఈ వ్యాధితో నలుగురికి చికిత్సలు అందిస్తున్నామని అగర్వాల్‌ వెల్లడించారు.


ఇదికూడా చదవండి: Congress: డీసీసీ కార్యాలయాలకు స్థలాలు!

ఇదికూడా చదవండి: Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌కు వరల్డ్‌ బ్యాంక్‌ నిధులు..

ఇదికూడా చదవండి: Hanumakonda: కొడుకులు తిండి పెట్టట్లేదు.. మా భూమిని తిరిగి ఇప్పించండి సారూ!

Read LatestTelangana News andNational News

Updated Date - Sep 24 , 2024 | 08:52 AM