South Central Railway: దసరా వేళ.. 770 ప్రత్యేక రైళ్లు
ABN, Publish Date - Oct 08 , 2024 | 07:36 PM
దసరా, చాత్ పూజ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల కోసం దాదాపు 770 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు తెలిపింది.
హైదరాబాద్, అక్టోబర్ 08: దసరా, చాత్ పూజ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల కోసం దాదాపు 770 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు తెలిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ రైల్వే సర్వీసులను నడుపుతున్నట్లు ప్రకటించింది.
Also Read: Jammu Kashmir Election Result 2024: మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే మార్గా్ల్లో వీటిని నడుపుతామని స్పష్టం చేసింది. కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, నాగర్ సోల్, మల్దా టౌన్, గోరఖ్ పూర్, దానాపూర్, రక్సల్, నిజాముద్దీన్, బర్హంపూర్, హౌరా మార్గాల్లో ఈ ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ఈ సందర్భంగా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే సూచించింది. అలాగే ఈ ప్రత్యేక రైల్వే రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభించినట్లు వివరించింది.
Also Read: బత్తాయి తింటే ఇన్ని లాభాలున్నాయా..?
ఓ వైపు దుర్గా పూజా, దీపావళి, చాత్ పూజా సందర్భంగా హైదరాబాద్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రజలు ప్రయాణిస్తారు. అయితే ఇప్పటికే ఆయా మార్గాల్లో ప్రయాణించే రైళ్లలో రిజర్వేషన్లు వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోయాయి. దాదాపు మూడు నెలల కిందటే.. ఈ రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయినాయి.
Also Read: Dasara Navaratri 2024: శరన్నవరాత్రుల్లో అతి ముఖ్యమైన రోజు.. ఎప్పుడంటే..?
Also Read: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు 2024: ఫలితాలు
దాంతో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వేళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దసరా పండగ వేళ.. 770 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి సైతం దాదాపు అన్ని రైళ్లకు రిజర్వేషన్లతో నిండిపోయిన సంగతి తెలిసిందే.
For Telangana News and Telugu News
Updated Date - Oct 08 , 2024 | 08:13 PM