ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: దివ్యాంగులకు స్మతా సబర్వాల్‌ క్షమాపణ చెప్పాల్సిందే..

ABN, Publish Date - Jul 23 , 2024 | 11:17 AM

రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో వస్తున్న ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌(IAS officer Smita Sabharwal) మాటలు దేశంలోని దివ్యాంగుల మనోభావాలు, ఆత్మవిశ్వాసం దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆమె తక్షణమే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని ప్రముఖ కళాకారిణి డాక్టర్‌ పద్మావతి(Dr. Padmavathi) డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్: రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో వస్తున్న ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌(IAS officer Smita Sabharwal) మాటలు దేశంలోని దివ్యాంగుల మనోభావాలు, ఆత్మవిశ్వాసం దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆమె తక్షణమే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని ప్రముఖ కళాకారిణి డాక్టర్‌ పద్మావతి(Dr. Padmavathi) డిమాండ్‌ చేశారు. మలక్‌పేటలోని వికలాంగుల కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒక రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్‌(IAS) రాసిన సందర్భంలో వికలాంగులు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారా అన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రూ.2 లక్షల రుణం ఇస్తామని.. రూ.1.20 లక్షలు కాజేశారు


రాజ్యాంగం మాకు కల్పించిన హక్కుతో హీరా సింఘాల్‌ లాంటి వారు ఎందరో ఉన్నత స్థాయిల్లో ఉన్నారని ఒక బాధ్యత గల అధికారిగా ఉన్న స్మిత సబర్వాల్‌(Smita Sabharwal) దివ్యాంగులను చులకనగా చేసి మాట్లాడడం వల్ల వారి ఆత్మవిశ్వాసంపై ప్రభావం పడుతుందన్నారు. దేశంలో వికలాంగుల చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదని వాటిని అమలు చేయాల్సిన అధికారులు దివ్యాంగులను చులకనగా చేసి మాట్లాడడం సరికాదన్నారు. వెంటనే స్మితా సబర్వాల్‌ తన మాటలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 23 , 2024 | 11:17 AM

Advertising
Advertising
<