ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: స్మిత సబర్వాల్‌ పోస్ట్‌ కలకలం.. నగరంలో దివ్యాంగుల నిరసన

ABN, Publish Date - Jul 23 , 2024 | 10:10 AM

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌(Senior IAS officer Smita Sabharwal) సోషల్‌ మీడియా పోస్ట్‌ సోమవారం నగరంలో అలజడి సృష్టించింది. సివిల్స్‌ పోస్టుల ఎంపికలో దివ్యాంగుల కోటా అవసరమా? అని ఆమె తన వ్యక్తిగత ‘ఎక్స్‌’ ఖాతాలో చేసిన పోస్ట్‌పై పలు సంఘాలు భగ్గుమన్నాయి.

- బహిరంగ క్షమాపణలకు డిమాండ్‌

హైదరాబాద్: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌(Senior IAS officer Smita Sabharwal) సోషల్‌ మీడియా పోస్ట్‌ సోమవారం నగరంలో అలజడి సృష్టించింది. సివిల్స్‌ పోస్టుల ఎంపికలో దివ్యాంగుల కోటా అవసరమా? అని ఆమె తన వ్యక్తిగత ‘ఎక్స్‌’ ఖాతాలో చేసిన పోస్ట్‌పై పలు సంఘాలు భగ్గుమన్నాయి. జాతీయ వికలాంగుల హక్కుల వేదిక(ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్‌, అడివయ్య ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో నిరసన వ్యక్తం చేశారు. ప్రతిభ ఎవరి సొత్తు కాదని, అంగవైకల్యం కలిగిన అనేకమంది అద్భుతాలు సృష్టిస్తున్న విషయం సీనియర్‌ అధికారి స్మితా సబ ర్వాల్‌కు తెలియదా అని ప్రశ్నించారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు(Skylab Babu) మాట్లాడుతూ దివ్యాంగులు ఒంటరి వారు కాదని, వారిజోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి: Metro Deluxe Buses: గ్రేటర్‌కు 300 మెట్రో డీలక్స్‌ బస్సులు..


స్మితా సభర్వాల్‌ దివ్యాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉమ్మడి ఏపీ దివ్యాంగుల సంస్థ చైర్మన్‌, టీడీపీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సాయిబాబా డిమాండ్‌ చేశారు. దివ్యాంగుల పట్ల చిన్నచూపు చూడడం తగదని ఆయన సూచించారు. అహంకారపూరిత పోస్ట్‌ చేసిన స్మితను చట్టప్రకారం శిక్షించాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ వల్లభనేని ప్రసాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు

దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన స్మితా సభర్వాల్‌, సినీ దర్శకుడు రాజమౌళిలపై చర్యలు తీసుకోవాలంటూ శాంతి దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు రజనీ ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 23 , 2024 | 10:10 AM

Advertising
Advertising
<