Hyderabad: నిలిచిన వైద్యసేవలు...
ABN, Publish Date - Aug 15 , 2024 | 09:05 AM
కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన ఘటనలో న్యాయం కోరుతూ నగరంలో జూనియర్ వైద్యులు(Junior doctors) బుధవారం ఆందోళన చేపట్టారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ సిబ్బంది కూడా నిరసనల్లో పాల్గొనడంతో నిలోఫర్, ఉస్మానియా, ఈఎన్‌టీ(Nilofar, Osmania, ENT) వంటి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
- కోల్‌కతా ఘటనపై జూడాల నిరసనలు
- టెక్నీషియన్లు సైతం ఆందోళనలో..
- ఆగిన వైద్య పరీక్షలు
- రోగులకు తప్పని ఇబ్బందులు
హైదరాబాద్: కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన ఘటనలో న్యాయం కోరుతూ నగరంలో జూనియర్ వైద్యులు(Junior doctors) బుధవారం ఆందోళన చేపట్టారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ సిబ్బంది కూడా నిరసనల్లో పాల్గొనడంతో నిలోఫర్, ఉస్మానియా, ఈఎన్‌టీ(Nilofar, Osmania, ENT) వంటి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. నిలోఫర్ ఆస్పత్రిలో గైనిక్ ఓపీ సేవలను ఉదయం 11 గంటల వరకు మాత్రమే నిర్వహించారు. దీంతో చాలా మంది గర్భిణులు చికిత్సలు చేయించుకోకుండానే వెనుదిరిగారు.
ఇదికూడా చదవండి: Hyderabad: అంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠా అరెస్ట్
జిల్లాల నుంచి రిఫరల్‌పై వచ్చిన రోగులకు నిలోఫర్‌లో అత్యవసర పరీక్షలు సైతం అందలేదు. ఆల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, 2డీ ఈకో, ఎక్స్‌రే, శాంపుల్ కలెక్షన్ వద్ద టెక్నీషియన్లు, సిబ్బంది లేకపోవడంతో అక్కడి సెక్యూరిటీ(Security) సిబ్బంది రోగులను తిరిగి వార్డుల్లోకి తరలించారు. నాలుగు రోజుల క్రితం అడ్మిషన్ తీసుకొని వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన రోగులను సైతం వెనక్కి పంపించారు.
దీంతో కొందరు ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగేందుకు ప్రయత్నించగా ఆర్‌ఎంఓలు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లు స్పందించి అత్యవసరమైనవారికి పరీక్షలు చేయించాలని సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. ఆస్పత్రిలో నిత్యం 200 మందికి సీటీస్కాన్ చేస్తారు. బుధవారం 60 మందికి మాత్రమే చేసి, గురువారం సాతంత్య్ర దినోత్సవం కావడంతో శుక్రవారం రావాలని రోగులను వార్డులకు తిప్పిపంపారు.
సీటీ స్కాన్ చేయడం లేదు..
మా బాబుకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో నాలుగు రోజుల క్రితం నిలోఫర్‌కు వచ్చాం. బుధవారం సీటీ స్కాన్, ఐక్యూతో పాటు మరో రెండు పరీక్షలు చేయించాలని వైద్యులు చెప్పారు. పరీక్షల కోసం ఉదయం నుంచీ తిరుగుతున్నాము. మధ్యాహ్నం 12 తర్వాత కొన్ని పరీక్షలు చేశారు. సీటీ స్కాన్ చేయలేదు.
- అంబదా్‌స(రోగి తండ్రి)
మంత్రి సీతక్క సంఘీబావం..
గాంధీ ఆస్పత్రిలోనూ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఓపీ సేవలను బహిష్కరించారు. వైద్యుల ఆందోళనకు మంత్రి సీతక్క సంఘీభావం ప్రకటించారు.
పరీక్షలు చేయలేదు..
బాబుకు ఆరోగ్యం బాగాలేదని రెండు రోజుల క్రితం నిలోఫర్‌లో చేర్పించాం. ఈరోజు ఆలా్ట్రసౌండ్ పరీక్షలు చేయించాలని వైద్యులు రాసి ఇవ్వడంతో ఇక్కడకు వచ్చాం. సిబ్బంది లేరని, శుక్రవారం రావాలని చెప్పారు. ఈ రోజు చేసేందుకు వీలుకాదన్నారు.
- కుమారుడితో సాజిద్, టోలీచౌకి
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Aug 15 , 2024 | 09:05 AM