Hyderabad: నగరంలో.. కాశ్మీర్ అందాలు
ABN, Publish Date - Nov 22 , 2024 | 08:10 AM
మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య మంచు కురుస్తుండగా కాశ్మీర్ అందాలను స్వయంగా చూస్తున్నట్లు అనుభూతి పొందేలా ఏర్పాటైన వింటర్ ఉత్సవ్ మేళా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
- పీపుల్స్ ప్లాజాలో వింటర్ ఉత్సవ్ మేళా ప్రారంభం
హైదరాబాద్: మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య మంచు కురుస్తుండగా కాశ్మీర్ అందాలను స్వయంగా చూస్తున్నట్లు అనుభూతి పొందేలా ఏర్పాటైన వింటర్ ఉత్సవ్ మేళా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పీపుల్స్ ప్లాజా మైదానంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender), సోమాజిగూడ కార్పొరేటర్ సంగీతా శ్రీనివాస్ యాదవ్(Srinivas Yadav) ప్రారంభించారు. కాశ్మీర్‌లో కనిపించే మంచు కొండలు, వాటర్ ఫాల్స్, అక్కడి జంతువులు, వాతావరణం, ఇళ్లు కళ్లకు కట్టేలా తయారు చేయగా.. సందర్శకులు ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Special trains: ఆర్‌ఆర్‌బీ పరీక్షలకు 42 ప్రత్యేక రైళ్లు
దాదాపు రెండువందల స్టాళ్లలో దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ వస్తువులను ప్రదర్శనతోపాటు అమ్మకానికి ఉంచారు. చలి కాలంలో ధరించే స్వెటర్లు, టోపీలు, పలు రకాల దుస్తులతో పాటు గృహోపకరణాలు, కాస్మెటిక్స్, తిను బండారాలతో కూడిన స్టాళ్లలో సందర్శకులు సందడి చేస్తున్నారు. ప్రదర్శన ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు 45 రోజులపాటు కొనసాగుతుందని నిర్వాహకుడు మీర్జా రఫీక్ బేగ్ తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. తరగతి గదిలో టీచర్ దారుణహత్య
ఈవార్తను కూడా చదవండి: మావోయిస్టుల దుశ్చర్య.. ఏం చేశారంటే..
ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌తో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ
ఈవార్తను కూడా చదవండి: అదానీతో బీజేపీ, కాంగ్రెస్ అనుబంధం దేశానికే అవమానం: కేటీఆర్
Read Latest Telangana News and National News
Updated Date - Nov 22 , 2024 | 08:10 AM