ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సెకనుకు రెండు బిర్యానీల డెలివరీ..

ABN, Publish Date - Dec 24 , 2024 | 07:04 AM

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ(Online food delivery) సంస్థ ఈ ఏడాది తమ ప్లాట్‌ఫామ్‌పై భారతీయులు ఏ విధంగా ఫుడ్‌ను శోధించారో తెలుపుతూ 9వ ఎడిషన్‌ నివేదికను ‘హౌ ఇండియా స్విగ్గీడ్‌’ శీర్షికన విడుదల చేసింది. ఈ ఏడాది 8.3 కోట్ల(83 మిలియన్‌) బిర్యానీలను స్విగ్గీలో ఆర్డర్‌ చేశారు.

- ఫుడ్‌ డెలివరీలో అగ్రస్థానం

- వెల్లడించిన ‘హౌ ఇండియా స్విగ్గీడ్‌’ అధ్యయనం

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ(Online food delivery) సంస్థ ఈ ఏడాది తమ ప్లాట్‌ఫామ్‌పై భారతీయులు ఏ విధంగా ఫుడ్‌ను శోధించారో తెలుపుతూ 9వ ఎడిషన్‌ నివేదికను ‘హౌ ఇండియా స్విగ్గీడ్‌’ శీర్షికన విడుదల చేసింది. ఈ ఏడాది 8.3 కోట్ల(83 మిలియన్‌) బిర్యానీలను స్విగ్గీలో ఆర్డర్‌ చేశారు. నిమిషానికి సుమారు 158 ఆర్డర్లు, సెకనుకు రెండు బిర్యానీలను ఆర్డర్‌ చేశారట. స్విగ్గీ తొమ్మిదేళ్లుగా విడుదల చేస్తున్న నివేదికలో బిర్యానీ రారాజుగా నిలవడం విశేషం. బిర్యానీ తరువాత అల్పాహార విభాగంలో దోశ నిలిచింది. ఈ ఏడాది 2.3 కోట్ల దోశలను ఆర్డర్‌ చేశారు. స్నాక్స్‌ విభాగంలో చికెన్‌ రోల్‌ అని చెబుతోందీ అధ్యయనం.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: తండ్రీ కొడుకులే సూత్రధారులు.. బోయిన్‌పల్లి యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు


దీనిని 24.8 లక్షల మంది ఆర్డర్‌ చేశారని, పొటాటో ఫ్రైలను 13 లక్షల మందికి పైగా ఆర్డర్‌ చేశారని వెల్లడించింది. ఈ సంవత్సరం జనవరి నుంచి నవంబరు 22 వరకు అందుబాటులో ఉన్న డాటా ఆధారంగా నివేదిక రూపొందించామని స్విగ్గీ వెల్లడించింది. బెంగళూరులో ఓ భోజన ప్రేమికుడు ఒకే ఆర్డర్‌లో ఏకంగా 49,900 రూపాయల విలువైన పాస్తా కొనుగోలుతో రికార్డు సృష్టించాడు. ముంబైకు చెందిన ఓ ఆహారాభిమాని 3 లక్షల రూపాయలను ఒకే రెస్టారెంట్‌ నుంచి చేస్తే, ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి అత్యధికంగా 1.22 లక్షల రూపాయలను సింగిల్‌ ఆర్డర్‌లో పొదుపు చేయడం విశేషం.


ఈవార్తను కూడా చదవండి: Revanth Reddy: సంక్రాంతికి వస్తున్నాం!

ఈవార్తను కూడా చదవండి: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్‌

ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: విచారణకు రండి..

ఈవార్తను కూడా చదవండి: Cybercrime: బరితెగించిన సైబర్‌ నేరగాళ్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 24 , 2024 | 07:04 AM