ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కబ్జాదారుల బరితెగింపు.. హెచ్‌ఎండీఏ భూముల ఆక్రమణకు యత్నం

ABN, Publish Date - Aug 04 , 2024 | 10:09 AM

దేశ అత్యున్నత న్యాయస్థానం అవి హెచ్‌ఎండీఏ(HMDA) భూములని చెప్పినా కబ్జాదారులు రెచ్చిపోయారు. మూడు ఎక్స్‌కవేటర్లతో రూ.500 కోట్ల విలువైన సుమారు 50 ఎకరాలను చదును చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని ఆక్రమణదారులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

- 50 ఎకరాలపై కన్ను.. విలువ రూ.500 కోట్లు

- ఐదుగురిపై కేసు, మూడు ఎక్స్‌కవేటర్లు స్వాధీనం

హైదరాబాద్: దేశ అత్యున్నత న్యాయస్థానం అవి హెచ్‌ఎండీఏ(HMDA) భూములని చెప్పినా కబ్జాదారులు రెచ్చిపోయారు. మూడు ఎక్స్‌కవేటర్లతో రూ.500 కోట్ల విలువైన సుమారు 50 ఎకరాలను చదును చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని ఆక్రమణదారులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్‌ సీఐ బాల్‌రాజ్‌(Shamshabad CI Balraj) తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌ పట్టణంలోని సర్వేనంబర్‌ 725లో 181 ఎకరాల హెచ్‌ఎండీఏ భూములున్నాయి.

ఇదికూడా చదవండి: Hyderabad: మురుగు శుద్ధి.. ఇక శరవేగంగా...


నగరానికి చెందిన మహ్మద్‌ ఖలీద్‌, మహ్మద్‌ షాబాజ్‌లు మూడు ఎక్స్‌కవేటర్లతో శనివారం భూములను చదును చేసేందుకు యత్నించగా విషయం తెలుసుకున్న హెచ్‌ఎండీఏ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మూడు ఎక్స్‌కవేటర్లను సీజ్‌ చేసి డ్రైవర్లు రషీద్‌, నందు, నిసార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కబ్జాకు యత్నించిన ఖలీద్‌, షాబాజ్‌లపై కేసులు నమోదు చేశామని, వారు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.


సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చినా..

ఉమ్మడి ఏపీలో ట్రక్కు టెర్మినల్‌ నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మున్సిపల్‌(Shamshabad Municipal) పరిధిలోని వివిధ సర్వేనంబర్లలో హెచ్‌ఎండీఏ((HMDA)) దాదాపు 214.02 ఎకరాల భూమిని సేకరించింది. వీటిలో పైగా ప్రాపర్టీస్‌కు చెందిన భూములు కూడా ఉన్నాయి. సర్వేనంబర్‌ 725/21లో 7 ఎకరాల 31 గుంటలు, సర్వేనంబర్‌ 725/23లో 10 ఎకరాల 12 గుంటలతోపాటు మరికొన్ని సర్వేనంబర్ల భూములు తమవేనంటూ గతంలో ఇద్దరు వ్యక్తులు హైకోర్టు(High Court)లో వ్యాజ్యం దాఖలు చేశారు.


ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి అవి హెచ్‌ఎండీఏ భూములని తేల్చింది. హైకోర్టులో కేసు ఓడిపోయిన అక్రమార్కులు తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆరునెలల క్రితం అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. అయినా, విలువైన భూములపై కన్నేసిన అక్రమార్కులు తిరిగి కబ్జాకు యత్నించారు.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Updated Date - Aug 04 , 2024 | 10:09 AM

Advertising
Advertising
<