Dogs: గంటల వ్యవధిలో 28 మందిపై కుక్కల దాడి.. జంకుతున్న జనం
ABN, Publish Date - Aug 02 , 2024 | 09:40 AM
Telangana: గ్రామ సింహాలను చూసి భయపడే రోజులు వచ్చాయి. బయటకు వెళ్లే సమయంలో వీధిలో కుక్కలు ఉన్నాయంటే చాలు వామ్మో కుక్కలు అంటూ అటు వైపునకు వెళ్లడమే మానేసుకుంటున్న పరిస్థితి. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందిరపై దాడి చేస్తూ వీధికుక్కులు రెచ్చిపోతున్నాయి. పలు సందర్భాల్లో కుక్కల దాడుల్లో చిన్నారులు ప్రాణాలు కూడా కోల్పోయారు.
హైదరాబాద్, ఆగస్టు 2: గ్రామ సింహాలను చూసి భయపడే రోజులు వచ్చాయి. బయటకు వెళ్లే సమయంలో వీధిలో కుక్కలు (Street Dogs) ఉన్నాయంటే చాలు వామ్మో కుక్కలు అంటూ అటు వైపునకు వెళ్లడమే మానేసుకుంటున్న పరిస్థితి. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందిరపై దాడి చేస్తూ వీధికుక్కులు రెచ్చిపోతున్నాయి. పలు సందర్భాల్లో కుక్కల దాడుల్లో చిన్నారులు ప్రాణాలు కూడా కోల్పోయారు. అనేక మంది పిల్లలు తీవ్ర గాయపడి ఆస్పత్రి పాలవుతున్నారు. దీంతో వీధికుక్కలంటే భాగ్యనగర ప్రజల హడలెత్తిపోతున్నారు.
గంట వ్యవధిలో బాలానగర్‌లో దాదాపు 28 మందిపై వీధి కుక్క దాడి చేసింది. వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు ఆస్పత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. బాలానగర్‌లోని రాజు కాలనీ, వినాయక నగర్, సాయి నగర్‌లో వీధి కుక్క స్వైర విహారం చేసింది. జీహెచ్‌ఎంపీ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల బెడదపై జీహెచ్‌ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 040- 2311 1111. కుక్కల బెడదపై ప్రతి రోజు జీహెచ్‌ఎంసీకి 500 నుంచి 1000 పిర్యాదులు వస్తున్నాయి.
ఈ క్రమంలో కుక్కల నియంత్రణలో బల్దియా సిబ్బంది చేతులెత్తిసిన పరిస్థితి. హై లెవెల్ కమిటీ వేసి బల్దియా చేతులు దులుపుకుంది. అయితే హై లెవల్ కమిటీ మాత్రం ఎనిమల్ కేర్ సెంటర్స్ విసిట్ కే పరిమితమైంది. హై లెవల్ కమిటీ ఏర్పాటు తర్వాత కుక్కల బెడద మరింత పెరిగింది. వీధి కుక్కలను పట్టుకునేందుకు టీములను పెంచని జీహెచ్ఎంసీ వైఖరి పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావలంటేనే జనం జంకుతున్నారు. నగరవాసులను వీధి కుక్కలు విచ్చల విడిగా కరుస్తున్నాయి. హైదరాబాద్‌లో కుక్కల బెడదపై ఇటీవల హైకోర్ట్ సీరియస్ అయిన విషయం తెలిసిందే.
Chandrababu : సీమలో ప్రతి ఎకరాకు సాగు నీరు
హైకోర్టు ఆదేశాలివే...
రాష్ట్రంలో చిన్న పిల్లలపై వీధికుక్కలు దాడి చేసి, చంపుతున్న సంఘటనలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం స్టెరిలైజేషన్ (సంతాన నిరోధక శస్త్రచికిత్స) ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించదని.. ఆయా రంగాల్లో పనిచేస్తున్న నిపుణులను సంప్రదించి పరిష్కారాలతో రావాలని ప్రభుత్వానికి, యానిమల్ బర్త్ కంట్రోల్ కమిటీకి ఆదేశాలు జారీచేసింది. చిన్నారులపై వీధికుక్కల దాడులకు సంబంధించిన పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. గతంలో ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌లతో కలిపి విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం గత నెల 18న మరోసారి విచారణ చేపట్టింది. ‘‘ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) కాదు. చిన్న పిల్లల ప్రాణాలకు సంబంధించిన అంశం. మానవీయకోణంలో అర్థం చేసుకోవాల్సిన ఈ అంశంలో ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ పనిచేయడం లేదంటూ పరస్పర ఆరోపణలకు అవకాశం లేదు. స్టెరిలైజేషన్ ఒక్కటే దీనికి మార్గం కాదు. స్టెరిలైజేషన్ చేసినంత మాత్రాన.. కుక్కలు పిల్లలపై దాడి చేయకుండా ఎలా నిరోధించగలుగుతాం. ఈ సమస్య ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో ఉంటే అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారో పరిశీలించి.. అమలు చేసే అవకాశం ఉండేది. ఇది ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రత్యేక సమస్య. దీనికి నిపుణులు మాత్రమే పరిష్కారం చూపగలరు. మాంసం దుకాణాల నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల కూడా కుక్కలు క్రూరంగా మారుతున్నాయి. ఈ సమస్యపై ఫిర్యాదులు స్వీకరించేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి’’ అని వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి...
Today Horoscope: ఈ రాశి విద్యాసంస్థలు, ఫైనాన్స్ కంపెనీల వారు జాగ్రత్తలు పాటించాలి.
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 02 , 2024 | 09:43 AM