ABN Live..: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ABN, Publish Date - Dec 18 , 2024 | 10:32 AM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. తర్వాత ప్రభుత్వం సభలో రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Winter Budget Sessions) నాలుగో రోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. తర్వాత ప్రభుత్వం సభలో రెండు కీలక బిల్లులు (Two key Bills) ప్రవేశపెట్టనుంది. తెలంగాణ పేమెంట్స్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ భూ భారతి బిల్ 2024 ను సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు బిల్లులపై చర్చించి శాసనసభ ఆమోదం తెలుపనుంది. కాగా ఈరోజు అసెంబ్లీలో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పినపై లఘు చర్చ జరుగుతుంది.
రోజుకో వేషం..
కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోజుకో వేషంతో అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారు. నిన్న (మంగళవారం) నల్ల చొక్కలు వేసుకుని వచ్చిన నేతలు.. ఈరోజు ఆటో డ్రైవర్ల వేషంలో ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు. మొదటి రోజు అదానీ, రాహుల్ గాంధీ టీ షర్ట్స్‌తో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న నల్ల చొక్కాలు ధరించి, బేడీలతో అసెంబ్లీకి వచ్చారు. లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బేడీలు ధరించారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని ఈరోజు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేయనున్నారు.
కాగా అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఆటో కార్మికుల యూనిఫాంలో ఎలా ఉన్నామో చూడండి అంటూ సాంబశివరావుకి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. కార్మికుల యూనిఫామ్ పవర్ ఏంటో ఇప్పటికైనా తెలిసిందా అని కూనంనేని సాంబశివరావు అన్నారు. మీరు మాతోపాటు యూనిఫామ్ వేసుకోకుండా దూరమయ్యారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. దీనిపై స్పందించిన ఆయన ‘మేము దూరం కాలేదు.. మీరే దూరం చేసుకున్నారు’ అంటూ కూనంనేని సాంబశివరావు సమాధానం ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నకరేకల్లు డబుల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ
గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో వెలుగులోకి కొత్త నిజాలు
కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విందు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 18 , 2024 | 10:35 AM