Drugs: హైదరాబాద్‌లో 620 గ్రాముల హెరాయిన్ పట్టివేత..
ABN, Publish Date - Aug 16 , 2024 | 01:00 PM
Telangana: భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ఇప్పటికే అనేక సార్లు డ్రగ్స్ పట్టుబడగా.. తాజాగా సైబరాబాద్ పరిధిలో రూ.4.34 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి టెలికాంనగర్‌లో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో నలుగురు రాజస్థాన్ పెడ్లర్లు ఉన్నట్లు గుర్తించారు.
హైదరాబాద్, ఆగస్టు 16: భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ (Drugs) కలకలం రేపింది. ఇప్పటికే అనేక సార్లు డ్రగ్స్ పట్టుబడగా.. తాజాగా సైబరాబాద్ పరిధిలో రూ.4.34 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి టెలికాంనగర్‌లో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో నలుగురు రాజస్థాన్ పెడ్లర్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 620 గ్రాముల హెరాయిన్, రెండు కార్లు, బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్, ఎస్ కోటి డీసీపీ శ్రీనివాస్ 1:00 గంటకు మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. ఇటీవల కాలంలో పలు చోట్ల డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే.
Devineni Avinash: దుబాయ్ పారిపోయేందుకు దేవినేని అవినాష్ యత్నం!.. చివరి నిమిషంలో
ఇంతకు ముందు రాచకొండ కమిషనర్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్‌ను రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్‌లను ఎస్‌వోటీ మహేశ్వరం జోన్, బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 100 గ్రాముల హెరాయిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన ఇద్దరు ఫెడ్లర్‌లు తండ్రి, కొడుకులుగా పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హానీఫ్ షా, సిద్ధిక్ షాలు తండ్రి కొడుకులు. హానీఫ్ షా స్క్రాప్ గోడౌన్ నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఎనిమిది మంది సంతానం. ఈ క్రమంలో కుటుంబపోషణ భారం కావడంతో తన కొడుకు సిద్ధిక్‌తో కలిసి కాస్మొటిక్ వ్యాపారం చేశాడు. అయితే కాస్మోటిక్ వ్యాపారంలోనూ నష్టాలు చవిచూశారు. దీంతో డ్రగ్స్ అమ్మితే భారీగా లాభాలు వస్తాయని తండ్రీకొడుకులు భావించారు. ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో చెడు మార్గాన్ని ఎంచుకున్నారు. అనుకున్నదే తడవుగా... రాజస్థాన్‌కు చెందిన మౌంటు నుంచి హెరాయిన్‌ను తండ్రి కొడుకులు కొనుగోలు చేశారు. హైదరాబాదులోని పలువురు డ్రగ్ ఫెడ్లర్‌లకు విక్రయిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు పక్కా ప్రణాళికతో అక్కడకు చేరుకుని.. డ్రగ్ ఫెడ్లర్‌లకు విక్రయిస్తుండగా తండ్రీకొడుకులిద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Big Breaking: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ ఖరారు.. ఎప్పుడంటే?
మరోవైపు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో పోలీసులపై కేసు నమోదు అయ్యింది. ఇన్‌స్పెక్టర్ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు అయ్యింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులపై ఉన్నతాధికారులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే డిటెక్టివ్ సీఐ రామిరెడ్డితో పాటు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
అలాగే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. మాణిక్యమ్మ కాలనీలో ఇందు అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని ఫ్యానుకు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. గతంలో రోడ్డు ప్రమాదంలో బాలిక గాయపడింది. ఈ ప్రమాదంలో ఇందుకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో తల నొప్పితో పాటు కడుపునొప్పి బాధ భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
Viral News: బీర్ టేస్ట్ చేసిన పాము.. చివరకు ఏమైందంటే..!
తెలంగాణ మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలు.. కాంగ్రెస్ సీరియస్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 16 , 2024 | 01:10 PM