ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్.. పట్టపగలు అందరూ చూస్తుండగానే..

ABN, Publish Date - Apr 13 , 2024 | 03:53 PM

హైదరాబాద్ ( Hyderabad ) గంజాయి బ్యాచ్ రెచ్చిపోతోంది. చిక్కడపల్లి పీఎస్ లిమిట్స్ ఎస్ఆర్టీ పార్క్ వద్ద గంజాయి మత్తులో కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే పట్టపగలే ఈ ఘటన చోటు చేసుకుంది.

Attack in Hyderabad

హైదరాబాద్ ( Hyderabad ) గంజాయి బ్యాచ్ రెచ్చిపోతోంది. చిక్కడపల్లి పీఎస్ లిమిట్స్ ఎస్ఆర్టీ పార్క్ వద్ద గంజాయి మత్తులో కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే పట్టపగలే ఈ ఘటన చోటు చేసుకుంది. వేగంగా బైక్ నడిపారంటూ ఎస్ఆర్టీ కాలనీ చెందిన ఓ యువకుడు ప్రశ్నించాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన మత్తులో ఉన్న యువకులు దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.


Nara Lokesh: నీ ప్రచారం పిచ్చి తగలెయ్యా.. ఆఖరుకు ఆయన్నూ వదలలేదా..

కాలనీలో గంజాయి బ్యాచ్ ఆగడాలు తట్టుకోలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. తాజా ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని కంప్లైంట్ తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. గతంలోను ఇదే ఎస్జీవై టీమ్ పేరుతో గంజాయి బాచ్ ఓ యువకుడిపై కత్తితో దాడి చేయడం గమనార్హం.


Elections 2024: అభ్యర్థి అవినాశ్ ను మార్చేందుకు యత్నాలు.. కుండ బద్దలు కొట్టిన షర్మిల..

మరోవైపు.. నగరానికి అక్రమంగా చేరుతున్న గంజాయి రవాణాపై పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల నుంచి సరకు తరలిస్తున్నా నిందితులను గుర్తించి పట్టుకోవడంలో జరుగుతున్న అలసత్వం నేరగాళ్ల పాలిట వరంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చక్కగా చదువుకుని భవిష్యత్ లో ఉన్నత స్థానానికి చేరుకోవాల్సిన యువత మత్తు గుప్పిట్లో చిక్కుకోవడం ఆందోళన కలిగించే విషయం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 13 , 2024 | 03:58 PM

Advertising
Advertising