Telangana: మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో విచారణ.. న్యాయస్థానం ఏం చెప్పిందంటే.
ABN, Publish Date - Jan 31 , 2024 | 05:23 PM
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. నాగోల్ కు చెందిన హరిందర్ అనే వ్యక్తి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. నాగోల్ కు చెందిన హరిందర్ అనే వ్యక్తి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో రద్దీ తీవ్రంగా పెరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు కూర్చునే పరిస్థితి కాదు కదా.. కనీసం నిల్చునే పరిస్థితీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత ప్రయాణం కోసం జారీ జారీ చేసిన జీఓ 47ను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌లో ప్రజా ప్రయోజనమేమీ లేదని హైకోర్టు పిటిషనర్ పేర్కొన్నారు. ఇబ్బందులు ఎదుర్కొని పిల్ దాఖలు చేశారన్నారు. దీంతో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటిషన్‌గా మార్చాలని రిజిస్ట్రీకి ఆదేశిస్తూ.. విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
కాగా.. 2023 చివరాంకంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆ హామీల్లో ఒకటైన మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా తెలంగాణకు చెందిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో గొడవలు, ఘర్షణలు సైతం జరగడం గమనార్హం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 31 , 2024 | 05:23 PM