Aadi Srinivas: లంకె బిందెలాంటి తెలంగాణను అప్పుల కుప్పగా చేశారు
ABN, Publish Date - Feb 26 , 2024 | 07:38 PM
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ది రాలేదని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్(Aadi Srinivas) అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ... నాగర్ కర్నూల్‌లో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు.
హైదరాబాద్: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ది రాలేదని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్(Aadi Srinivas) అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ... నాగర్ కర్నూల్‌లో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. రైతు బిడ్డా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. తన తీరు మార్చుకోకపోతే ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. పదేళ్లు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని.. అనేక హామీలు అమలు చేయలేదని అన్నారు. లంకె బిందెలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా చేశారని విరుచుకుపడ్డారు.
సీఎం రేవంత్ రాష్ట్ర ఆదాయాన్ని సరి చేసేందుకు అహర్నిశలు కష్ట పడుతున్నారని చెప్పారు. కేటీఆర్ ఉనికిని కాపాడుకోవడానికి సీఎంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణ జలాల పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. కృష్ణ జలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకు అప్పగించిన విషయం నిజం కాదా..? అని నిలదీశారు. గత బీఆర్ఎస్ పాలనలో మేడిగడ్డ కుంగి పోయిందని.. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని గుర్తించే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా అహంకారం తగ్గలేదని అన్నారు. ఇంకోసారి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే కేటీఆర్ తాట తీస్తామని అది శ్రీనివాస్ హెచ్చరించారు.
Updated Date - Feb 26 , 2024 | 07:39 PM