Abhishek Singhvi: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ నామినేషన్
ABN, Publish Date - Aug 19 , 2024 | 11:25 AM
Telangana: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్న సింఘ్వీకి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నామినేషన్ వేసేందుకు సింఘ్వీ బయలుదేరగా..
హైదరాబాద్, ఆగస్టు 19: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi )నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్న సింఘ్వీకి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నామినేషన్ వేసేందుకు సింఘ్వీ బయలుదేరగా.. ఆయన వెంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరి సమక్షంలో సింఘ్వీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఒక్కొక్క సెట్‌కు పది మంది ఎమ్మెల్యేల సంతకాలు చేశారు.
KTR: కేటీఆర్‌తో శ్రీలంక మంత్రి భేటీ.. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రగతిపై ప్రశంసలు
కాగా.. అభిషేక్ మను సింఘ్వీని రాజ్యసభ సభ్యుడిగా సీఎల్పీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిని కావడం గర్వంగా ఉందని సింఘ్వీ చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో రాజ్యసభతో పాటు కోర్టుల్లో తన వాదన బలంగా వినిపిస్తానని అభిషేక్ స్వింఘ్వీ తెలిపారు. మరోవైపు అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబరు 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కే కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి గత నెల 5న రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది.
CM Chandrababu: తెలుగుగింటి ఆడపడుచులకు సీఎం చంద్రబాబు రాఖీ శుభాకాంక్షలు
ఫిబ్రవరిలో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగగా.. శాసనసభలో కాంగ్రెస్‌కున్న సంఖ్యాబలాన్ని బట్టి రెండు సీట్లు దక్కాయి. వాటిలో ఒక సీటును ఏఐసీసీ తన కోటా కింద తీసుకోవాలని భావించినా.. ఇక్కడి సామాజిక సమీకరణాల దృష్ట్యా రెండు సీట్లనూ టీపీసీసీకే ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఖాళీ అయిన సీటును ఏఐసీసీ కోటా కింద తీసుకుంది. సింఘ్వీని అభ్యర్థిగా నిర్ణయించింది. ప్రస్తుతం శాసనసభలో ఈ సీటుకు పోటీ పడే సంఖ్యా బలం ఏ పార్టీకీ లేనందున సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నెల 27న నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తవుతుంది. అనంతరం సింఘ్వీ ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు. సింఘ్వీ పదవీ కాలం ఏప్రిల్ 9, 2026 వరకు (ఒక ఏడాది ఏడు నెలలు) ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
Minister Komati Reddy: అనాథ బాలికకు అండగా మంత్రి కోమటి రెడ్డి
Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే ఆర్జిత సేవా టికెట్లు విడుదల
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 19 , 2024 | 11:28 AM