ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Group 4 candidates: గాంధీభవన్ వద్ద గ్రూప్ - 4 అభ్యర్థుల ఆందోళన.. డిమాండ్స్ ఇవే

ABN, Publish Date - Oct 18 , 2024 | 11:56 AM

Telangana: గ్రూప్ -2, గ్రూప్ -1 మెయిన్‌కు ఎంపిక అయిన వారిని గ్రూప్ 4 నుంచి వెంటనే అన్ లివింగ్ చేయాలని గ్రూప్-4 ఉద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేశారు. పెద్ద పోస్ట్‌లలో ఉన్న వారు అన్ లివింగ్ ఆప్షన్ ఇవ్వాలన్నారు. వారి పోస్ట్‌లు వచ్చి వెళ్లిన తర్వాత బ్యాక్ లాగ్‌లుగా ఉంచవద్దని.. దీని వల్ల వెనకున్న అభ్యర్థులు నష్టపోతారని వాపోయారు.

Agitation of Group-4 candidates at Gandhi Bhavan

హైదరాబాద్, అక్టోబర్ 18: గాంధీ భవన్ వద్ద గ్రూప్ -4 ఉద్యోగ అభ్యర్థులు శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు. కొందరు గ్రూప్ -2, గ్రూప్ -1 (Group-1) మెయిన్‌కు ఎంపిక అయిన వారిని గ్రూప్ 4 నుంచి వెంటనే అన్ లివింగ్ చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద పోస్ట్‌లలో ఉన్న వారు అన్ లివింగ్ ఆప్షన్ ఇవ్వాలన్నారు. వారి పోస్ట్‌లు వచ్చి వెళ్లిన తర్వాత బ్యాక్ లాగ్‌లుగా ఉంచవద్దని.. దీని వల్ల వెనకున్న అభ్యర్థులు నష్టపోతారని వాపోయారు. రెండు వేల పోస్ట్‌లు ఖాళీ అయ్యో అవకాశం ఉందని.. వెంటనే ప్రభుత్వం స్పందించాలని గ్రూప్ -4 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ -1 అభ్యర్థుల ఆందోళనతో గాంధీభవన్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వారిని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Lokesh: విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి లోకేష్


కాగా.. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ అయిన విషయం తెలిసిందే. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. వివిధ కారణాలతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలపై హైకోర్టులో (Telangana High Court) అభ్యర్థులు పలు పిటిషన్‌లు దాఖలు చేశారు. ఇటీవల ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణకు వచ్చింది. గ్రూప్‌ 1‌ ప్రిలిమ్స్ పరీక్షలపై దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గ్రూప్ 1లో తప్పుడు ప్రశ్నలను తొలగించాలని ఒక పిటిషన్ దాఖలవగా.. ప్రిలిమీనరీ కీ లో తప్పులు ఉన్నాయని, కీ ని రీ నోటిఫికేషన్ చేయాలని మరో పిటిషన్‌ను అభ్యర్థులు దాఖలు చేశారు. తప్పుడు ప్రశ్నలు తొలగించి మళ్లీ మెరిట్ జాబితాను విడుదల చేయాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. త్వరలో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరగబోతున్నాయని ఈ సమయంలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే మెయిన్స్ విద్యార్థులు నష్టపోతారని టీజీపీఎస్‌సీ కోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పిటిషన్‌లను కొట్టివేసింది. దీంతో ఈనెల 21 నుంచి గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరుగనున్నాయి.

AP News: భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ



మరోవైపు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థులు ఈ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నెల 21 నుంచి 27వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలను హెచ్‌ఎండీఏ పరిధిలో నిర్వహిస్తున్నారు. హాల్‌టికెట్లు పరీక్ష ప్రారంభమయ్యే ఒక రోజు ముందు వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. మెయిన్స్‌ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందుగా పరీక్ష హాల్‌లోకి చేరుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు అభ్యర్థులను అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వచ్చే వారిని అనుమతించబోమని స్పష్టంచేశారు. మెయిన్స్‌లో భాగంగా ప్రతి అభ్యర్థి ఆరు పేపర్లకు సంబంధించి పరీక్షలు రాయాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి..

Viral: బాబోయ్.. అది దెయ్యం ఇల్లా.. ఏలియన్స్ స్థావరమా? అంటార్కిటికా మంచులో భారీ తలుపు.. నెటిజన్ల కామెంట్లు..

TG News: మాజీ మంత్రి బంధువులపై చీటింగ్ కేసు.. ఏం జరిగిందంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 18 , 2024 | 04:56 PM