ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AICC: దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపు

ABN, Publish Date - Aug 22 , 2024 | 09:54 AM

Telangana: నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు గన్‌పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు టీపీసీసీ ర్యాలీ చేయనుంది. ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాలో పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జీ మున్షీ అదానీ పాల్గొననున్నారు.

Congress Protest

హైదరాబాద్, ఆగస్టు 22: నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ (AICC) పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు గన్‌పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు టీపీసీసీ ర్యాలీ చేయనుంది. ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాలో పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జీ మున్షీ అదానీ పాల్గొననున్నారు. మెగా కుంభకోణంపై విచారణ జరపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahu Gandhi) పట్టుబట్టారు. సెబీ చైర్మన్ రాజీనామా చేయాలనీ, దోషులను చట్టపరంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేయగా.. ఆయన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది.

Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. విమానంలో 135 మంది ప్రయాణికులు


నేడు ఢిల్లీకి రేవంత్

మరోవైపు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. నేటి రాత్రికి సీఎం హస్తినకు పయనమవుతారు. రేపు (శుక్రవారం) ఉదయం హైకమాండ్‌తో రేవంత్ భేటీ కానున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రివర్గ విస్తరణపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా పాల్గొనాలని సోనియా గాంధీని సీఎం రేవంత్ ఆహ్వానించనున్నారు. అలాగే రైతు రుణమాఫీ నేపథ్యంలో రైతు కృతజ్ఞత సభకు రావాలని రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు.


ఇవి కూడా చదవండి...

Japan: రెండు కత్తెర్లు అదృశ్యం..

US Arrest: రహస్య కెమెరాలతో మహిళలు, పిల్లల నగ్న వీడియోలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 22 , 2024 | 10:08 AM

Advertising
Advertising
<