TG politics: నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేయనున్న ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ..
ABN, Publish Date - Jun 07 , 2024 | 11:25 AM
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVSS Prabhakar) తనపై చేసిన అవినీతి ఆరోపణలపై ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ (Deepadas Munshi) మరికాసేపట్లో నాంపల్లి కోర్టు(Nampally Court) ను ఆశ్రయించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVSS Prabhakar) తనపై చేసిన అవినీతి ఆరోపణలపై ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ (Deepadas Munshi) మరికాసేపట్లో నాంపల్లి కోర్టు(Nampally Court)ను ఆశ్రయించనున్నారు. తాను 'క్విడ్ ప్రో కో'కు పాల్పడ్డానంటూ గతంలో ప్రభాకర్ చేసిన ఆరోపణలపై దీపాదాస్ మున్షీ పరువునష్టం దావా వేయనున్నారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల కోసం పలువురు నేతలు ఆమెకు బెంజ్ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చారంటూ ప్రభాకర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
దీనిపై దీపాదాస్ మున్షీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఇప్పటికే ఆమె లీగల్ నోటీసులు పంపించారు. ఆరోపణలపై ఆధారాలు చూపించాలని, లేకపోతే రూ.10కోట్ల పరువు నష్టం దావా వేస్తానని దీపాదాస్ మున్షీ హెచ్చరించారు. దీనిపై తాజాగా ఆమె నాంపల్లి కోర్టును ఆశ్రయించనున్నారు. కొన్నేళ్లుగా కాంగ్రెస్ ఇన్‌ఛార్జులపై అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. గత ఐదేళ్లలో ఇద్దరు మాజీ ఇన్‌ఛార్జులపైనా ఇలానే ఆరోపణలు రావడంతో అధిష్ఠానం వారిని పక్కన పెట్టింది. ప్రస్తుత ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్.. పదవులు, ఎన్నికల్లో టికెట్లు ఇప్పించేందుకు బెంజ్ కార్లు తీసుకున్నారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. దీనిపై ఆమె పరువునష్టం దావా వేసేందుకు నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు.
ఇది కూడా చదవండి:
Students Protest: ఆహారంలో పురుగులపై మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి ఆందోళన..
Updated Date - Jun 07 , 2024 | 11:47 AM