ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kuchipudi: ఆల్ ఇండియా డాన్స్ పోటీల్లో పుణ్యకీర్తి ప్రతిభ

ABN, Publish Date - Nov 05 , 2024 | 03:39 PM

హైదరాబాద్‌లోని బిర్లా భాస్కర్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఆల్ ఇండియా డాన్స్, మ్యూజిక్ పోటీల్లో కూచిపూడి విభాగంలో ముడియ పుణ్యకీర్తి అనే విద్యార్థిని ప్రతిభ కనబరచింది. ఈ పోటీలకు అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు.

హైదరాబాద్: నగరంలోని బిర్లా భాస్కర్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఆల్ ఇండియా డాన్స్, మ్యూజిక్ పోటీల్లో కూచిపూడి విభాగంలో ముడియ పుణ్యకీర్తి అనే విద్యార్థిని ప్రతిభ కనబరచింది. ఈ పోటీలకు అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. కాగా, కూచిపూడి విభాగంలో నిర్వహించిన పోటీల్లో అనేక మంది విద్యాార్థులు పాల్గొన్నారు. వీరిలో ఏపీలోని విజయనగరానికి చెందిన పుణ్యకీర్తి మూడో బహుమతి సాధించింది. ఈ సందర్భంగా సదరు విద్యార్థినికి నిర్వాహకులు మెమొంటో అందజేశారు.


విజయనగరంలోని భగవతి నాట్యకళామందిర్‌కు చెందిన విద్యార్థి ముడియ పుణ్యకీర్తి.. ఆల్ ఇండియా డాన్స్, మ్యూజిక్ కాంపిటీషన్‌‌లో కూచిపూడి విభాగంలో మూడో బహుమతి సాధించింది. త్వరలో ఢిల్లీలో జరగబోయే ఫైనల్ పోటీలకు పుణ్యకీర్తి ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. తమ విద్యార్థిని కూచిపూడి విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరచడంపై నాట్యకళామందిర్‌ నిర్వాహకురాలు వడ్లమాని రమణకుమారి సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 05 , 2024 | 04:14 PM