Allu Arjun Case: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల సాయం..
ABN, Publish Date - Dec 25 , 2024 | 03:09 PM
Allu Arjun Announces Financial Assistance to Sri Tej: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబానికి భారీ సాయం ప్రకటించారు అల్లు అరవింద్.
హైదరాబాద్, డిసెంబర్ 25: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబానికి భారీ సాయం ప్రకటించారు అల్లు అరవింద్. రూ. 2 కోట్ల సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్‌ను దిల్‌రాజ్‌కు అందజేశారు. ఈ మొత్తం సాయంలో అల్లు అర్జున్ రూ. కోటి, సుకుమార్ రూ. 50 లక్షలు, మైత్రీ మూవీస్ తరఫున రూ. 50 లక్షలు అందజేశారు.
బుదవారం మధ్యాహ్నం సమయంలో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజ్, అల్లు అరవింద్, మరికొందరు సినీ ప్రముఖులు కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను, అతని కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు. కిమ్స్‌లో మీడియాతో మాట్లాడిన అల్లు అరవిందద్.. శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్‌ను దిల్‌రాజ్‌కు అందజేశారు. ఇదిలాఉంటే.. ఇప్పటికే అల్లు అరవింద్ రూ. 10 కోట్ల డీడీ పంపినట్లు శ్రీతేజ్ తండ్రి ప్రకటించారు. అలాగే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ. 25 లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ రూ. 50 లక్షలు అందజేసినట్లు ఆయన తెలిపారు.
సినీ ప్రముఖులంతా సీఎంను కలుస్తామని ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు తెలిపారు. శ్రీతేజ్ త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. వెంటిలేటర్ లేకుండా 72 గంటలుగా శ్రీతేజ్‌కు చికిత్స అందిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య తనను వారధిగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్లు దిల్ రాజ్ చెప్పారు.
Also Read:
జూనియర్ పాంటింగ్ వచ్చేస్తున్నాడు..
For More Telangana News and Telugu News..
Updated Date - Dec 26 , 2024 | 11:00 AM