Allu Arjun Arrest: నాన్నను వారించి.. భార్యకు ధైర్యం చెప్పి..
ABN, Publish Date - Dec 13 , 2024 | 02:16 PM
ఇంటికి వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. అయితే, అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 13: సంధ్య థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇంటికి వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. అయితే, అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్‌తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ సైతం పోలీస్ వాహనం ఎక్కారు. దీంతో తండ్రిని పోలీస్ వాహనం ఎక్కొద్దంటూ అల్లు అర్జున్ వారించారు. ఏం జరిగినా.. మంచైనా.. చెడైనా.. అంతా తనదేనంటూ తండ్రికి చెప్పారు. అరవింద్‌ను పోలీస్ వాహనం నుంచి దించేశారు.
భార్యకు భరోసా..
అరెస్ట్ సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి అల్లు అర్జున్ ధైర్యం చెప్పారు. తనకు ఏమీ కాదని ఆమెకు భరోసా ఇచ్చారు. తలను నిమిరి, ముద్దు పెట్టి ధైర్యం చెప్పారు. అనంతరం పోలీసులతో కలిసి చిక్కడపల్లి పీఎస్‌కు వెళ్లారు.
హైకోర్టులో పిటీషన్..
అరెస్ట్‌పై అల్లు అర్జున్ హైకోర్టులో క్వాషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్‌పై విచారణ జరపాలని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనంలో పిటిషన్‌ను మెన్షన్ చేసిన న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. విచారించిన ధర్మాసనం.. ఏపీపీని ప్రశ్నించారు. స్పందించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్.. పోలీసులను అడిగి 2.30 గంటలకు చెబుతానన్నారు. దీంతో విచారణ 2.30 గంటలకు వాయిదా పడింది.
Also Read:
పెద్ద కేసులే పెట్టారుగా.. ఎన్నేళ్ల జైలు శిక్ష పడనుందంటే..
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు.. వీడియో చూడండి..
స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం..
For More Telangana News and Telugu News..
Updated Date - Dec 16 , 2024 | 07:17 AM