ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Drugs: డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ తండ్రీకొడుకులు...

ABN, Publish Date - Jul 27 , 2024 | 03:39 PM

Telangana: డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిని, డ్రగ్స్ తీసుకుంటున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా డ్రగ్స్‌ సరఫరాకు మాత్రం అడ్డుకట్ట పడని పరిస్థితి. ముఖ్యంగా భాగ్యనగరంలో డ్రగ్స్ సరఫరా కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో పలు చోట్ల డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే.

Drugs bust in Hyderabad

హైదరాబాద్, జూలై 27: డ్రగ్స్ (Drugs) ర్మూలనకు పోలీసులు (Telangana Police) అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిని, డ్రగ్స్ తీసుకుంటున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా డ్రగ్స్‌ సరఫరాకు మాత్రం అడ్డుకట్ట పడని పరిస్థితి. ముఖ్యంగా భాగ్యనగరంలో డ్రగ్స్ సరఫరా కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో పలు చోట్ల డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి రాచకొండ కమిషనర్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది.

YS Jagan: వైఎస్ జగన్‌ను నెటిజన్లు గట్టిగానే ఆడుకుంటున్నారే..!


రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్‌ను రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్‌లను ఎస్‌వోటీ మహేశ్వరం జోన్, బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 100 గ్రాముల హెరాయిన్‌ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన ఇద్దరు ఫెడ్లర్‌లు తండ్రి, కొడుకులుగా పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హానీఫ్ షా, సిద్ధిక్ షాలు తండ్రి కొడుకులు. హానీఫ్ షా స్క్రాప్ గోడౌన్ నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఎనిమిది మంది సంతానం. ఈ క్రమంలో కుటుంబపోషణ భారం కావడంతో తన కొడుకు సిద్ధిక్‌తో కలిసి కాస్మొటిక్ వ్యాపారం చేశాడు. అయితే కాస్మోటిక్ వ్యాపారంలోనూ నష్టాలు చవిచూశారు. దీంతో డ్రగ్స్ అమ్మితే భారీగా లాభాలు వస్తాయని తండ్రీకొడుకులు భావించారు. ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో చెడు మార్గాన్ని ఎంచుకున్నారు. అనుకున్నదే తడవుగా... రాజస్థాన్‌కు చెందిన మౌంటు నుంచి హెరాయిన్‌ను తండ్రి కొడుకులు కొనుగోలు చేశారు. హైదరాబాదులోని పలువురు డ్రగ్ ఫెడ్లర్‌లకు విక్రయిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు పక్కా ప్రణాళికతో అక్కడకు చేరుకుని.. డ్రగ్ ఫెడ్లర్‌లకు విక్రయిస్తుండగా తండ్రీకొడుకులిద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

EMPS: ఎలక్ట్రిక్ వాహనాల స్కీం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం


నెల రోజుల్లో హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టుబటం ఇది రెండో సారి. ఇటీవల సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్‌ డివిజన్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఐదుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌సింగ్‌ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. గతంలో డ్రగ్స్‌ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆరోపణలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరాపై పక్కా సమాచారంతో నార్కోటిక్ బ్యూరో, ఎస్వోటీ, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించారు. దాదాపు 200 గ్రాములకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి...

Hari Rama Jogaiah: హరిరామ జోగయ్య మళ్లీ స్టార్ట్ చేశారు.. ఈసారి చంద్రబాబును కూడా..

Bandi Sanjay: కాళేశ్వరం వెళ్లి ఏం సాధించావ్ కేటీఆర్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 27 , 2024 | 03:48 PM

Advertising
Advertising
<