ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sheep Scam: మరోసారి ఏసీబీ ముందుకు గొర్రెల స్కామ్‌లో మోసపోయిన ఏపీ రైతులు

ABN, Publish Date - Jul 18 , 2024 | 10:51 AM

Telangana: కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో చోటుచేసుకున్న అక్రమాలపై ఏసీబీ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గొర్రెల స్కామ్‌లో మోసపోయిన ఏపీ రైతులు మరోసారి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. గొర్రెల స్కామ్‌లో రైతుల స్టేట్ మెంట్ రికార్డ్ చేసేందుకు రైతులను ఏసీబీ అధికారులు పిలిపించారు.

Sheep Scam

హైదరాబాద్, జూలై 18: కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో చోటుచేసుకున్న అక్రమాలపై ఏసీబీ (ACB) విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గొర్రెల స్కామ్‌లో మోసపోయిన ఏపీ రైతులు (AP Farmers) మరోసారి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. గొర్రెల స్కామ్‌లో (Sheep Scam) రైతుల స్టేట్ మెంట్ రికార్డ్ చేసేందుకు రైతులను ఏసీబీ అధికారులు పిలిపించారు. దీంతో పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి రైతులు చేరుకున్నారు.

AP News: వినుకొండలో నడిరోడ్డుపై హత్య ఉదంతంపై స్పందించిన టీడీపీ


గొర్రెల స్కీమ్‌కు గాను ఎన్ని యూనిట్లు ఇచ్చారు..? కాంట్రాక్టర్‌లు ఎలా మోసం చేశారు అనేదానిపై రైతులను ఏసీబీ ఆరా తీస్తోంది. రెండు జిల్లాలలో 2కోట్ల రూపాయల విలువ చేసే 130కి పైగా యూనిట్లను గొర్రెల పంపిణీ స్కీమ్‌ గాను కాంట్రాక్టర్‌కు రైతులు ఇచ్చారు. ఇప్పటికే గొర్రెల స్కీమ్‌లో 700 కోట్ల స్కామ్ జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. కాంట్రాక్టర్ మొయిదిద్దున్‌తో పాటు మరో పది మంది కాంట్రాక్టర్లు గొర్రెల స్కీమ్‌లో ఉన్నట్టు ఏసీబీ విచారణలో నిర్ధారణ అయ్యింది. గొర్రెల కొనుగోళ్ల పేరిట రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. కాగా... గొర్రెల స్కామ్‌లో మొదట రూ. 2.10 కోట్లు దారి మళ్ళినట్టు గుర్తించారు. పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామ్ చందర్ నాయక్ , ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్‌తో రూ.700 కోట్ల స్కామ్ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది.

AP News: ఎంపీడీఓ అదృశ్యం కేసులో వీడని మిస్టరీ


ఈడీ సైతం...

మరోవైపు గొర్రెల స్కీమ్‌లో 700 కోట్ల స్కామ్‌పై మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఎన్ఫోర్స్‌మెంట్స్ డైరెక్టరేట్ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ కార్యాలయంలో ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు. ఈ కేసులో కీలక సూత్రధారులైన లక్ష్మారెడ్డి, మొహిదొద్దీన్‌ ప్రమేయంపై ఆరా తీయనుంది.


ఇవి కూడా చదండి...

Tomato prices: ఠారెత్తిస్తున్న టమాటా!

High Court: బీఆర్‌ఎస్‌కు ఇచ్చిన 11 ఎకరాలు మావే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 18 , 2024 | 10:55 AM

Advertising
Advertising
<