ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KCR: కేసీఆర్‌ వియ్యంకుడిపై అట్రాసిటీ కేసు నమోదు..

ABN, Publish Date - Dec 14 , 2024 | 11:49 AM

మాజీ సీఎం కేసీఆర్‌ వియ్యంకుడు, ఎమ్మెల్సీ కవిత మామ, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత రాంకిషన్‌రావుపై కేసు నమోదైంది. నిజామాబాద్‌లో ఓ స్థల వివాదం విషయంలో..

KCR and Kavitha

నిజామాబాద్‌, డిసెంబరు 14: మాజీ సీఎం కేసీఆర్‌ వియ్యంకుడు, ఎమ్మెల్సీ కవిత మామ, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత రాంకిషన్‌రావుపై కేసు నమోదైంది. నిజామాబాద్‌లో ఓ స్థల వివాదం విషయంలో గాధారి గోపి ఫిర్యాదు మేరకు నిజామాబాద్‌ రూరల్‌పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాంకిషన్‌రావుతోపాటు కొండూరు నగేష్‌, సూదం రవిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని బైపాస్‌రోడ్డులో ఉన్న ఆర్‌కేఆర్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద 235 గజాల స్థలం విషయమై కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు రాంకిషన్‌రావు, అతని అనుచరులు ప్రయత్నిస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని అపార్ట్‌మెంట్‌కు చెందిన గోపి అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్టు రూరల్‌ పోలీసు స్టేషన్‌ ఎస్సై ఎండీ ఆరీఫ్‌ తెలిపారు. ఈ స్థలం తమదని, తాము ఎలాంటి కబ్జా చేయలేదని కొండూరు నగేష్‌ తెలిపారు. ఈ వివాదంతో ఎమ్మెల్సీ కవిత మామ రాంకిషన్‌రావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అపార్ట్‌మెంట్‌ వాసుల్లో కొందరు తన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అదే పోలీసు స్టేషన్‌లో నగేష్‌ ఫిర్యాదు చేశారు.


Also Read:

అల్లు అర్జున్ ఇంటికి సురేఖ

స్టేషన్‌లో ఆగకుండా వెళ్లిన రైలు... మళ్లీ వెనకొచ్చింది...
ఎర్రకోట మాది.. తిరిగిచ్చేయండి..

For More Telangana News and Telugu News..

Updated Date - Dec 14 , 2024 | 11:52 AM