Crime News: హైదరాబాద్ బేగంబజార్‌లో దారుణం..
ABN, Publish Date - Dec 13 , 2024 | 08:05 AM
హత్యలకు పాల్పడి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మహమ్మద్ సిరాజ్ అలీ, భార్య హేలియ, కుమారుడు హైజాన్.. కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిరాజ్ భార్య, కొడుకుని హత్య చేసిన తర్వాత సూసైడ్ నోటు రాసి ఉరి వేసుకున్నాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సిరాజ్ కుటుంబం..
హైదరాబాద్: బేగంబజార్ పోలీస్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్య గొంతు కోసి, కుమారుని గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై అతను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణాన్ని మరో కుమారుడు చూశాడు. తల్లిని, తమ్ముణ్ణి చంపుతున్న సమయంలో భయాందోళనకు గురైన మృతుని పెద్ద కుమారుడు తప్పించుకున్నాడు. సమాచారం తెలుసుకున్న బేగంబజార్ పోలీసులు క్లూస్ టీంతో సంఘటన ప్రదేశానికి చేరుకుని.. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హత్యలకు పాల్పడి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మహమ్మద్ సిరాజ్ అలీ, భార్య హేలియ, కుమారుడు హైజాన్.. కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిరాజ్ భార్య, కొడుకుని హత్య చేసిన తర్వాత సూసైడ్ నోటు రాసి ఉరి వేసుకున్నాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సిరాజ్ కుటుంబం.. బ్రతుకు దేరువు కోసం నగరానికి వచ్చారు. ఈ ఘటనకు కారణం తెలియరాలేదు. కాగా సూసైడ్ నోటులో ఏం రాశాడో తెలియదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
అలాగే హైదరాబాద్ మియాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. నాగలక్ష్మి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఆన్ లైన్‌లో గుర్తు తెలియని మందు ఆర్డర్ చేసుకుని.. సేవించి ఆత్మహత్య చేసుకుంది. కాగా ఇటీవలే నాగలక్ష్మికి వివాహమైంది. ఆమె ఆత్మహత్యకు గల కారనాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జనం మెచ్చేలా! మనం నచ్చేలా పాలన
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 13 , 2024 | 08:05 AM