ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: హైడ్రా తీరుపై స్వయంగా పాట పాడిన బండి సంజయ్

ABN, Publish Date - Sep 28 , 2024 | 02:42 PM

Telangana: హైడ్రా తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా పాట పాడి వినిపించారు. ‘‘పారణి ఇంకా ఆరణలేదు. తోరణాల కల వాడనేలేదు’’ అంటూ పాట పాడి సెటైర్లు విసిరారు. ఇప్పటి వరకు జరిగిన కూల్చి వేతలన్నీ హిందువులవే అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Union Minister Bandi Sanjay

హైదరాబాద్, సెప్టెంబర్ 28: చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన హైడ్రా (HYDRA) జెట్‌స్పీడులో కూల్చివేతలు చేపట్టింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పేదలకు చెందిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. దీంతో హైడ్రాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హైడ్రా కూల్చివేతలపై కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా తీరుపై కేంద్ర మంత్రి స్వయంగా పాట పాడి వినిపించారు. ‘‘పారాణి ఇంకా ఆరణలేదు. తోరణాల కల వాడనేలేదు’’ అంటూ పాట పాడి సెటైర్లు విసిరారు. ఇప్పటి వరకు జరిగిన కూల్చి వేతలన్నీ హిందువులవే అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ముస్లింలకు సంబంధించిన ఏ ఒక్క బిల్డింగ్ కూల్చలేదన్నారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ కొరివితో తల గోక్కుతోందన్నారు. హైడ్రాకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ హైడ్రా నిర్ణయం వల్ల పేదలు రోడ్డున పడ్డారని మండిపడ్డారు.

Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు..


రేపు మూసీ వల్ల పేద ప్రజలకు తీరని అన్యాయం జరగనుందన్నారు. మూసి పేరిట లేని ఇబ్బందులు తెస్తున్నారని తెలిపారు. గతంలో ఒకాయన ఇలా అని ఫామ్ హౌస్ లో పడుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. జీతాలు ఇవ్వడానికి, రుణమాఫీ, ఆరు గ్యారెంటీలకు డబ్బులు లేవని.. లోకల్ బాడి ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా డౌన్ అవుతుందన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ఒకటే గతి పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ మరో శ్రీలంక కాబోతోందంటూ కేంద్రమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ నిధులే అంశంగా ఎన్నికలకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు సిద్ధమా అంటూ సవాల్ విసారారు. గతంలో ఇచ్చిన నిధులపై లోకల్ బాడి ఎన్నికలకు రావాలి అంటూ రెండు పార్టీలకు బండి ఛాలెంజ్ విసిరారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని మనవి చేశారు.

Sri Lanka VS New Zealand: న్యూజిలాండ్‌కు శ్రీలంక భారీ షాక్.. క్రికెట్ చరిత్రలోనే మూడో భారీ ఫాలో ఆన్..


జగన్ వ్యాఖ్యలపై...

అలాగే హిందువులపై జగన్‌ మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి నైతికంగా ఫెయిల్ అయ్యారన్నారు. మక్కా , వాటికన్ సిటీలకు వెళితే కొన్ని నిబంధనలు ఉంటాయని.. దానిమీద మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. హిందువులపై మాట్లాడి జగన్‌మోహన్ రెడ్డి మరింత అపవాదు మూటగట్టుకున్నారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దళితులకు గుడి ప్రవేశం ఇవ్వలేదని.. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నారన్నారు. మదర్సలపై మాట్లాడే అర్హత ఒవైసీకి లేదన్నారు. ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాలేదని ప్రశ్నించారు. ‘‘ గతంలో కేసీఆర్.. బండి సంజయ్‌ను బచ్చగాడు అన్నాడు.. బచ్చగాడి దమ్ము ఏంటో చూశారు’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

TelanganaBhavan: తమ గోడు వెళ్లబోసుకునేందుకు తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 28 , 2024 | 02:46 PM